Telangana : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు..ఫ్యూచర్ కోసం సమ్మర్ హాలీడేస్‌ నేతల ప్లాన్స్

ఒకప్పుడు.. పార్టీ మారితే పొలిటికల్ కెరీర్ బాగుంటుందని లెక్కలేసుకున్న వాళ్లంతా.. ఇప్పుడు పాత పార్టీయే బెటరనుకుంటున్నారు. మరికొందరు.. ఫామ్‌లో ఉన్న పార్టీలోకి మారాలని చూస్తున్నారు.

Telangana : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు..ఫ్యూచర్ కోసం సమ్మర్ హాలీడేస్‌ నేతల ప్లాన్స్

Karimnagar Party Change Leaders

Karimnagar Party change leaders : ఒకప్పుడు.. పార్టీ మారితే పొలిటికల్ కెరీర్ బాగుంటుందని లెక్కలేసుకున్న వాళ్లంతా.. ఇప్పుడు పాత పార్టీయే బెటరనుకుంటున్నారు. మరికొందరు.. ఫామ్‌లో ఉన్న పార్టీలోకి మారాలని చూస్తున్నారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో.. సిట్టింగ్‌లకు రెబల్స్ బెడత తప్పేలా కనిపించడం లేదు. ఇప్పుడు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా.. రాబోయే ఎన్నికల్లో.. ఎలాగైనా పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం.. ఇప్పటి నుంచే కరీంనగర్ జిల్లా నాయకులు.. ఈ సమ్మర్ హాలీడేస్‌లోనే వ్యూహాలు రచించుకుంటున్నారు.

2018 ఎన్నికల తర్వాత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది నేతలు.. అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. అక్కడేదో.. ఒక పదవి దక్కకపోతుందా అని పార్టీ మారిన మాజీలంతా.. ఇప్పుడు నిరాశలో మునిగిపోయారు. ఇంతకాలం.. పదవి దక్కుతుందని ఆశతో పార్టీలో కంటిన్యూ అయిన వాళ్లంతా.. మిడిల్ డ్రాప్ అవడమే మంచిదనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. అధికార పార్టీని వీడి.. ప్రతిపక్ష పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో.. మరో పార్టీలో జాయిన్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్.. టీఆర్ఎస్‌లో చేరారు. అయితే.. ఈ ముగ్గురు మాజీలకు పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోయినా.. సైలెంట్‌గా కారు పార్టీలోనే జర్నీ చేశారు. ఇంకా.. వెయిట్ చేస్తూ కూర్చుంటే.. జనాలు తమను మర్చిపోతారని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. తిరిగి.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. ఆరెపల్లి మోహన్ మానకొండూర్ నుంచి టీఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని.. ధీమాగా ఉన్నార. ఒకవేళ.. టికెట్ దక్కకపోతే మాత్రం ఏదో ఒక పార్టీలో చేరి.. పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు.. స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే.. వీళ్లకు.. బీజేపీ నుంచి ఆఫర్లు కూడా వచ్చాయని.. జిల్లా మొత్తం అనుకుంటున్నారు.

ఇక.. అంతర్గత కలహాలతో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ.. కమలం పార్టీలో ఇమడలేకపోతున్నారు. ఆయన్ని.. జిల్లా అధ్యక్షుడిగా నియమించినా.. ఎవరూ సహకరించడం లేదని.. ఓపెన్‌గానే అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు.. రామగుండం బీజేపీ టికెట్‌కు పోటీ ఎక్కువగా ఉండటం.. కండీషన్స్ అప్లై అంటూ చెబుతుండటంతో.. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు.. సన్నిహత వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సోమారపు ఇండిపెండెంట్‌గానూ పోటీ చేసే చాన్స్ ఉందని.. అనుచరులు చెబుతున్నా.. కాంగ్రెస్‌లోనూ చేరే అవకాశాలు లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయ్.

వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకులను బరిలోకి దించే ప్లాన్‌లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు పార్టీ మారిన నాయకులపై ఫోకస్ చేసింది. తిరిగి పార్టీలోకి వస్తే.. వారికివ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు టికెట్ కూడా ఇస్తామంటూ.. కొందరికి రేవంత్ హామీ ఇచ్చినట్లు.. కాంగ్రెస్ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. వీరిలో.. మాజీ ఎమ్మెల్యేలు అలిగి రెడ్డి ప్రవీణ్, సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ త్వరలోనే.. కాంగ్రెస్ గూటికి చేరతారంటూ.. కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. అయితే.. యూటర్న్ తీసుకునేందుకు రెడీగా ఉన్న నాయకులు.. ఏ పార్టీలోకి టర్న్ తీసుకుంటారన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.