Jr NTR : తారక్ కారు నెంబర్ 9999 వెనుక కారణం ఏంటంటే..!

జూనియర్ ఎన్టీఆర్ కార్లన్నిటికి 9999 నెంబర్ వాడతాడు.. తనకు సెంటిమెంట్స్ లేవని చెప్పే తారక్‌కి 9 అంకె బాగా ఇష్టం అంట..

Jr NTR : తారక్ కారు నెంబర్ 9999 వెనుక కారణం ఏంటంటే..!

Jr Ntr Car

Updated On : May 20, 2021 / 6:26 PM IST

Jr NTR: సాధారణంగా సినిమా వాళ్లు ఒక సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గరినుండి గుమ్మడికాయ కొట్టేవరకు ముహుర్తాలు, సెంటిమెంట్స్ పక్కాగా ఫాలో అవుతుంటారు.. టైటిల్‌లో అక్షరాల దగ్గరి నుండి రిలీజ్ డేట్ వరకు కూడా సెంటిమెంట్ అనేది తప్పనిసరి..

ఇక సెలబ్రిటీలు వాడే లగ్జీరియస్ కార్ల నెంబర్ల గురించి అయితే చెప్పక్కర్లేదు.. కారుకి తగ్గట్టే తమకు నచ్చిన నెంబర్ల కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు.. జూనియర్ ఎన్టీఆర్ కార్లన్నిటికి 9999 నెంబర్ వాడతాడు.. తనకు సెంటిమెంట్స్ లేవని చెప్పే తారక్‌కి 9 అంకె బాగా ఇష్టం అంట.. తాత కారు నెంబర్ 9999 అలాగే తండ్రి హరికృష్ణ కూడా అదే నెంబర్ వాడేవారని.. అందుకే తను 9 నెంబర్ అంటే అంత ఇష్టమని తారక్ చెప్పాడు..

Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..

అంతేకాదు ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్‌లో కూడా ఎన్టీఆర్ 9999 (@tarak9999) అని ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుండి తారక్ చేస్తున్న కొమురం భీమ్ న్యూ పోస్టర్ రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..