UnStoppable : పండక్కి అన్‌స్టాపబుల్‌లో వీరసింహా రెడ్డి స్పెషల్ ఎపిసోడ్.. పవన్ ఎపిసోడ్ ఇప్పట్లో లేనట్టే..

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ షూట్ కూడా పూర్తయింది. సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారని అంతా భావించారు. ఈ ఎపిఓస్డ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పండక్కి వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ అనౌన్స్ చేయడంతో ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లేనట్టే అని..............

UnStoppable : పండక్కి అన్‌స్టాపబుల్‌లో వీరసింహా రెడ్డి స్పెషల్ ఎపిసోడ్.. పవన్ ఎపిసోడ్ ఇప్పట్లో లేనట్టే..

UnStoppable next episodes announcement

UnStoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండో సీజన్ లో కూడా ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో ఎనిమిదో ఎపిసోడ్ గా కూడా ప్రభాస్ తోనే ఉండబోతుంది. దీంట్లోనే ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా రానున్నాడు. ప్రభాస్, గోపీచంద్ రానున్న ఎనిమిదో ఎపిసోడ్ జనవరి 6న ఆహాలో స్ట్రీమ్ అవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ ని కూడా ప్రకటించారు ఆహా టీం. ఎనిమిదో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ టెలికాస్ట్ అయిన తర్వాత తొమ్మిదో ఎపిసోడ్ గా వీరసింహ రెడ్డి చిత్ర యూనిట్ రానున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాపబుల్ షోకి వీరసింహ రెడ్డి చిత్ర యూనిట్ రానున్నారు. హీరోయిన్ శృతి హాసన్ తో పాటు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, నిర్మాతలు, మరి కొంతమందిని కూడా తీసుకురానున్నట్టు సమాచారం.

Samantha : చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించిన సమంత..

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ షూట్ కూడా పూర్తయింది. సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారని అంతా భావించారు. ఈ ఎపిఓస్డ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పండక్కి వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ అనౌన్స్ చేయడంతో ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లేనట్టే అని తెలుస్తుంది. గత సీజన్ అన్‌స్టాపబుల్ పది ఎపిసోడ్స్ తో ముగించింది. చివరి ఎపిసోడ్ గా మహేష్ బాబుతో గ్రాండ్ గా ప్లాన్ చేసింది అన్‌స్టాపబుల్ సీజన్ 1. దీంతో అన్‌స్టాపబుల్ సీజన్ 2ని కూడా 10 ఎపిసోడ్స్ తో ముగించి చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా టెలికాస్ట్ చేయాలని ఆహా భావిస్తున్నట్టు సమాచారం.