UP Election 2022: యూపీలో పోలింగ్ శాతం ఏం చెబుతోంది.. అధికార మార్పు జరుగుతుందా?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 62.08 శాతం ఓటింగ్ నమోదైంది.

UP Election 2022: యూపీలో పోలింగ్ శాతం ఏం చెబుతోంది.. అధికార మార్పు జరుగుతుందా?

Jhats

UP Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 62.08 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో 11 జిల్లాల్లోని 58 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ స్థానాల్లో గ‌త 3 ఎన్నిక‌ల్లో లెక్కలను పరిశీలిస్తే..

ఓట్లు పోలైన 11 జిల్లాల్లో మొదటి దశలో 58 సీట్లు ఉండగా.. 2017లో 63.75 శాతం, 2012లో 61.03 శాతం ఓటింగ్ నమోదైంది. వాస్తవానికి, తక్కువ ఓటింగ్ అనేది అధికార మార్పు వేవ్‌గా పరిగణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2017, 2012 ఎన్నికలలో కూడా ఈ విషయం గమనించవచ్చు. యూపీలో అధికార మార్పు దిశ పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచే నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ఎన్నికలు జరిగిన 58 స్థానాల్లో 2017 ఎన్నికల్లో 53 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అదే సమయంలో బీఎస్పీ, ఎస్పీ ఖాతాలో చెరో రెండు సీట్లు వచ్చాయి. ఈసారి ఎస్పీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ అప్పట్లో ఒక్క సీటు గెలుచుకుంది. బీజేపీ ఓడిపోయిన 5స్థానాల్లో 4 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది.

వ్యవసాయ చట్టాల ప్రభావం:
నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ప్రభావాన్ని చూపింది. ఈ ఉద్యమం కారణంగా ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయనే అంచనాలు ఉన్నాయి. ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా జాట్‌లు కూడా పనిచేశారు. ఓటింగ్ జరిగిన స్థానాల్లో, దాదాపు రెండు డజన్ల స్థానాల్లో జాట్‌ల జనాభా 35 శాతంగా ఉంది. తొలి దశ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి మధ్య పోటీ తీవ్రంగా ఉందని భావిస్తున్నారు.

2017లో ఏం జరిగింది?
2017 ఎన్నికలలో, ఈ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతం బీజేపీ విజయానికి ముఖ్యమైన ప్రాంతంగా నిలిచింది. ఈ ప్రాంతంలో బీజేపీ దూసుకుపోయి రాష్ట్రమంతటా ఆధిక్యంలో నిలవడానికి కారణం అయ్యింది. ఈ ప్రాంతంలోని 58 సీట్లలో 53 గెలుచుకుంది. ఇది ఆనాటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వేవ్ ఫలితం అని పరిగణించబడింది.