Govt employees Dowry : కట్నం ఎంత తీసుకున్నారో ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిందే..ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక

పెళ్లిలో వరకట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాల్సిందే..నంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Govt employees Dowry : కట్నం ఎంత తీసుకున్నారో ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిందే..ప్రభుత్వ ఉద్యోగులకు  హెచ్చరిక

Govt Employees Dowry Calculations

govt employees dowry calculations : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చిక్కొచ్చి పడింది. దీని గురించి ప్రభుత్వ ఉద్యోగులు ఇరకాటంలో పడ్డారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న క్రమంలో ఈ కొత్తరకం నోటీసు ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే..‘ప్రభుత్వ ఉద్యోగులు వరకట్నం ఎంత తీసుకున్నారో ప్రభుత్వానికి లెక్క చెప్పాలి‘అని నోటీసులు జారీ చేసింది యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు షాక్ అవుతున్నారు. ఇదేంటీరా బాబూ అన్నట్లుగా ఉంది సర్కార్ ఉద్యోగుల పరిస్థితి.

వరకట్న వ్యవస్థని అంతం చేసేందుకు యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా ఈ కొత్త ఉత్తర్వు ప్రకారం.. 2004 సంవత్సరం తర్వాత వివాహం చేసుకున్న ఉద్యోగులు..అది అధికారులైనా సరే..తమ వివాహ సమయంలో తీసుకున్న వరకట్నం వివరాలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగులకు, అధికారులకు నోటీసు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాలకు ఈ లేఖ పంపారు.దీనికి సంబంధించి అక్టోబరు 12న పాలనాధికారి మార్గదర్శకాలు జారీ చేశారు.

Read more : Dowry: కావలసినంత కట్నం తేలేదని ఏం చేశాడంటే..!

ఇందులో భాగంగా..2004 తర్వాత వివాహం చేసుకున్న ఉద్యోగులు, అధికారుల నుంచి వరకట్నం వివరాలను తెలిపాలని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి శాఖాధిపతుల ద్వారా నోటీసులు పంపి సమాధానం చెప్పాలని కోరుతున్నారు. పెళ్లి అయిన సంవత్సరం, అప్పటి వారి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. పెళ్లి సందర్భంగా తీసుకున్న కట్నం వివరాలు (అవి గిఫ్టులుగా గానీ లేదా వరకట్నం రూపంలో గానీ) తీసుకున్న వివరాలు అందజేయాల్సిన ఉంటుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఈ కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. ఈ రూల్ ప్రకారం..ఉద్యోగులు డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి. మ్యానిఫెస్టోలో ఉద్యోగులు తమ వివాహ సమయంలో కట్నం తీసుకున్నారా? లేదా? తీసుకుంటే ఎంత తీసుకున్నారు? ఏఏ రూపాల్లో తీసుకున్నారు? అనే పలు వివరాలకు తెలపాలి. 31 ఏప్రిల్ 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరిగా చేశారు.ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించకపోతే అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. కానీ ఎందుకు ఈ వివరాలు చెప్పాలో మాత్రం తెలపలేదు. అన్ని ప్రభుత్వ శాఖలు అక్టోబర్ లోపు మేనిఫెస్టోను కంప్లీట్‌ చేయాలన్నారు. వరకట్న వ్యవస్థని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వు వివిధ ప్రభుత్వ శాఖల్లో కలకలం రేపుతోంది.

Read more : కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య.. భర్తతో ఫోన్ కాల్ మాట్లాడుతూ మృతి

వరకట్నం అనేది సాంఘిక దురాచారంగా మారిందని దీని వల్ల ఎంతోమంది ఆడబిడ్డలు బలైపోతున్నారని..పలు హింసలకు గురవుతున్నారని..దీంతో వరకట్న వ్యవస్థను అరికట్టడానికి యుపి ప్రభుత్వం సంకల్పించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా..యూపీ 1999లో వరకట్న నిషేధ చట్టం రూపొందించింది. మార్చి 31, 2004 న సవరణ చేసింది.ఈ సవరణల నిబంధనల ప్రకారం.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివాహ సమయంలో ఎటువంటి కట్నం తీసుకోలేదని డిక్లరేషన్‌ని అందించాలని నిబంధన ఉంది.

కాగా..ఈ చట్టం విషయంలో 2004లో మొదటి సవరణ జరిగింది. దాని నియమాల ప్రకారం..ప్రతి ప్రభుత్వోద్యోగి తన వివాహ సమయంలో స్వీయ నియంత్రణ అంటే తాను కట్నం తీసుకోను అని నిర్ణయించుకోవాలని..దానికి కట్టుబడి ఉండాలని..నిబంధన విధించింది. తన వివాహంలో తాను ఎలాంటి కట్నం తీసుకోలేదని ప్రకటించి..దానికి సంబంధించి డిక్లరేషన్‌పై సంతకం చేసి సమర్పిచాల్సి ఉంది.