Vaishnav Tej : వైష్ణవ్ తేజ్ ప్రేమిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ తను ఎవర్ని ప్రేమిస్తున్నాడో రివీల్ చేసేశాడు..

Vaishnav Tej : వైష్ణవ్ తేజ్ ప్రేమిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

Vaishnav Tej

Vaishnav Tej: ఆగండి మేం చెప్తామంటున్న మహేష్ బాబు.. బాలీవుడ్ హీరోయిన్‌ని ప్రేమిస్తున్న మెగా హీరో.. బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జయమ్మ.. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్‌డేట్స్ బ్రీఫ్‌గా చూద్దాం.

మీ ఇష్టమొచ్చినట్టు మీరు అనుకోవద్దు.. ఆగండి మేం చెప్తాం అంటున్నారు మహేష్ బాబు ప్రొడ్యూసర్లు. ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ నడుస్తుండడంతో.. ఏ విషయమైనా మేం అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ తను ఎవర్ని ప్రేమిస్తున్నాడో రివీల్ చేసేశాడు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అంటే ఇష్టం కాదని ప్రేమని అంటున్నాడు. ‘దబాంగ్’ సినిమాలో చూసిన దగ్గరనుంచి ప్రేమిస్తూనే ఉన్నా అంటున్నాడు ఈ మెగా హీరో.

బాలకృష్ణ – గోపిచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ అందుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. బాలయ్యకు విలన్‌గా నటిస్తుందా.. మరేదైనా క్యారెక్టర్ చేస్తుందా అన్నది మాత్రం సస్పెన్స్. మలినేని గోపీచంద్ -రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ మూవీలో జయమ్మగా సూపర్బ్ పర్ఫామెన్స్ ఇచ్చింది వరలక్ష్మి.

డిఫరెంట్ స్టోరీస్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు దొంగతనాల బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్న సినిమా ‘రాజ రాజ చోర’. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేసింది టీమ్.