Varun Sandesh : ‘ఇందువదన’ ఈసారైనా హిట్ వచ్చేనా..?

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ఇందువదన’.. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్నారు. .

Varun Sandesh : ‘ఇందువదన’ ఈసారైనా హిట్ వచ్చేనా..?

Varun Sandesh New Movie Titled As Induvadana

Updated On : June 29, 2021 / 4:14 PM IST

Varun Sandesh: శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ఇందువదన’. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది.

అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు MSR. విడుదలైనప్పటి నుంచి ‘ఇందువదన’ లుక్‌కు మంచి స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. వరుణ్ సందేశ్ కూడా ‘ఇందువదన’ సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమాలో వ‌రుణ్ సందేశ్ పోషిస్తున్న వాసు పాత్ర‌కి సంబంధించిన లుక్, అలానే ఫ‌ర్నాజ్ శెట్టి పోషిస్తున్న ఇందు పాత్రకి సంబంధించిన లుక్ కూడా టీమ్ విడుద‌ల చేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్తియింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో భారీగా వేసిన సెట్స్‌లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

నటీనటులు:
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), అ౦బఋషి, ‘జెర్సీ’ మోహన్ తదితరులు..