Veera Simha Reddy: సెన్సార్ పనులు ముగించుకున్న వీరసింహారెడ్డి..!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే అన్నిపనులు ముగించుకున్న ‘వీరసింహారెడ్డి’ మూవీ తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Veera Simha Reddy Completes Censor Work
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే అన్నిపనులు ముగించుకున్న ‘వీరసింహారెడ్డి’ మూవీ తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’గా నందమూరి బాలయ్య మనవడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!
వీరసింహారెడ్డి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా పూర్తిగా బాలయ్య మార్క్ మూవీగా వచ్చిందని, అభిమానులకు ఈ సినిమాతో బాలయ్య కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, ఆయన నోటివెంట వచ్చిన పలు డైలాగులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Veera Simha Reddy : వీరసింహారెడ్డి ట్రైలర్‌లో బాలయ్య పొలిటికల్ డైలాగ్స్..
బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తారో చూడాలి.
It’s U/A for #VeeraSimhaReddy??
All set to Roar in Theatres from Jan 12 ???#VeeraSimhaReddyOnJan12th
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @ramjowrites @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/6OnXQvYcTR
— Mythri Movie Makers (@MythriOfficial) January 9, 2023