Veera Simha Reddy: వీరసింహారెడ్డి అప్పుడే ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేశాడా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియట్ అయ్యాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ సెట్స్‌లో సందడి చేసిన తమిళ హీరో..!
ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా నుండి ‘జై బాలయ్య’ అనే మాస్ యాంథమ్‌ను నవంబర్ 25న ఉదయం 10.29 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా ఉన్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Veera Simha Reddy: బాలయ్య సినిమాలో ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదట.. ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ..?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీరసింహారెడ్డి ఓటీటీ రైట్స్‌ను అత్యంత భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ మరోసారి మోతమోగిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.