‘దృశ్యం 2’ లో విక్టరీ వెంకటేష్.. మరో హిట్ పక్కా..

‘దృశ్యం 2’ లో విక్టరీ వెంకటేష్.. మరో హిట్ పక్కా..

Drushyam 2: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ 2013 లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, తమిళ్‌లో విశ్వనాయకుడు కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గన్ రీమేక్ చెయ్యగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

Drushyam - Malayalam

తాజాగా ‘దృశ్యం 2’ పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యి అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఆంటోని పెరుంవబూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ లాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం వస్తున్నాయి.

Drushyam

ఇప్పుడు ‘దృశ్యం 2’ ని కూడా వెంకీ తెలుగులో రీమేక్ చెయ్యనున్నారు. తాజాగా దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాతలు, వెంకీ, సురేష్ బాబు కలిసి ఈ సినిమా రీమేక్ గురించి చర్చలు జరిపారు.

Drushyam 2

మార్చి 5న ‘దృశ్యం 2’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, మార్చి 6 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 50 రోజుల్లో సినిమాను పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. తెలుగు ‘దృశ్యం’ ని శ్రీప్రియ డైరెక్ట్ చేశారు. తెలుగులో జీతూ జోసెఫ్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Drushyam 2