Viral video: రైల్వే స్టేష‌న్‌లో వృద్ధుడిని కాళ్ళ‌తో తంతూ రెచ్చిపోయిన‌ పోలీసు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్పూర్ రైల్వే స్టేష‌న్‌లో గోపాల్ ప్ర‌సాద్ అనే వృద్ధుడు ప్లాట్‌ఫాంపై ఉన్నాడు. పోలీసు వ‌ద్ద‌కు వెళ్ళిన గోపాల్ ఓ వ్య‌క్తి గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ వెంట‌నే గోపాల్‌ను ఆ పోలీసు కొట్ట‌డం ప్రారంభించాడు. కింద‌ప‌డేసి తంతూ, పిడిగుద్దులు కురిపిస్తూ రెచ్చిపోయాడు. ఆ పోలీసును అక్క‌డున్న వారు ఎవ్వ‌రూ అడ్డుకునే ప్రయ‌త్నం కూడా చేయ‌లేదు.

Viral video: రైల్వే స్టేష‌న్‌లో వృద్ధుడిని కాళ్ళ‌తో తంతూ రెచ్చిపోయిన‌ పోలీసు

Police

Viral video: రైల్వే స్టేష‌న్‌లో ఓ వృద్ధుడి ప‌ట్ల‌ పోలీసు దారుణంగా వ్య‌వ‌హ‌రించాడు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొట్టి, కాళ్ళు ప‌ట్టుకుని పైకి లేపి, రైలు పట్టాల వైపుగా ఈడ్చుకు వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్య‌క్తి త‌న స్మార్ట్‌ఫోనులో తీస్తూ లైవ్‌లో సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఉన్న‌తాధికారుల వ‌ర‌కు వెళ్ళింది. అయితే, ఈ వీడ‌యోలో ఆ పోలీసులు ముఖం స‌రిగ్గా క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతున్నామ‌ని అధికారులు అంటున్నారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్పూర్ రైల్వే స్టేష‌న్‌లో గోపాల్ ప్ర‌సాద్ అనే వృద్ధుడు ప్లాట్‌ఫాంపై ఉన్నాడు. పోలీసు వ‌ద్ద‌కు వెళ్ళిన గోపాల్ ఓ వ్య‌క్తి గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ వెంట‌నే గోపాల్‌ను ఆ పోలీసు కొట్ట‌డం ప్రారంభించాడు. కింద‌ప‌డేసి కాళ్ళతో తంతూ, పిడిగుద్దులు కురిపిస్తూ రెచ్చిపోయాడు. ఆ పోలీసును అక్క‌డున్న వారు ఎవ్వ‌రూ అడ్డుకునే ప్రయ‌త్నం కూడా చేయ‌లేదు.

చివ‌ర‌కు ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. గోపాల్ ప్ర‌సాద్‌ను వివ‌రాలు అడిగారు. ఓ వ్య‌క్తి త‌న‌ను తిట్టాడ‌ని, ఈ విష‌యంపై పోలీసుకు ఫిర్యాదు చేయ‌డానికి వెళ్ళాన‌ని గోపాల్ అన్నాడు. అయితే, ఆ పోలీసు త‌న‌నే కొట్టాడ‌ని, ఎందుకు కొట్టాడో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని గోపాల్ చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

borewell: బోరుబావిలో ప‌డి 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన బాలిక.. 5 గంటల్లో బ‌య‌ట‌కు తీసిన జ‌వాన్లు