Vijay Devarakonda : గీతాగోవిందం కాంబో.. రౌడీ హీరో సరసన మృణాల్ ఠాకూర్.. ఓపెనింగ్ పూజా కార్యక్రమం..

విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. పరుశురాం - విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది.

Vijay Devarakonda : గీతాగోవిందం కాంబో.. రౌడీ హీరో సరసన మృణాల్ ఠాకూర్.. ఓపెనింగ్ పూజా కార్యక్రమం..

Vijay Devarakonda and Mrunal Thakur pair up for Parusuram VD13 Movie

Mrunal Thakur :  విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లైగర్(Liger) సినిమాతో కొంచెం గ్యాప్ తీసుకొని ఈ సారి ఆసక్తికర ప్రాజెక్ట్స్ ని పట్టుకొస్తున్నాడు. ప్రస్తుతం విజయ్, సమంత(Samantha) కాంబోలో శివ నిర్వాణ(Shiva Niravana) దర్శకత్వంలో ఖుషి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత VD12 జెర్సీ(Jersy) డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో విజయ్ స్పై క్యారెక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ఓపెనింగ్ చేశారు.

ఇక విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. పరుశురాం – విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుండటంతో దీనిపై కూడా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకుండానే సడెన్ గా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అంతే కాక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది అని ప్రకటించారు. మృణాల్ కూడా VD13 పూజా కార్యక్రమంలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపోయింది. విజయ్ మృణాల్ పై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. విజయ్ – మృణాల్ కాంబోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Vijay Devarakonda and Mrunal Thakur pair up for Parusuram VD13 Movie

 

Tamannaah : అలాంటి సినిమాలతో హీరోలకే గుర్తింపు వస్తుంది.. అందుకే బాహుబలిలో నాకు గుర్తింపు రాలేదు.. తమన్నా సంచలన వ్యాఖ్యలు..

ఇక మృణాల్ కూడా సీతారామం సక్సెస్ తో వరుసగా ఆఫర్లు సాధిస్తుంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోను మృణాల్ వరుస సినిమాలు చేస్తుంది.