Vijay: ‘వారసుడు’ హీరో మరో తెలుగు డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టాడా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay: ‘వారసుడు’ హీరో మరో తెలుగు డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టాడా..?

Vijay Next Movie With Telugu Director Gopichand Malineni

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల ‘వారిసు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా తరువాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.

Vijay : ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమిళ్ స్టార్ విజయ్.. ఎంట్రీతోనే సోషల్ మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు..

ఇక ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేసి రిలీజ్ చేయాలని లోకేశ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా తరువాత విజయ్ తన నెక్ట్స్ మూవీని కూడా ఓ తెలుగు డైరెక్టర్‌తో చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విజయ్ కోసం ఓ యంగ్ తెలుగు డైరెక్టర్ అదిరిపోయే కథను రెడీ చేశాడని.. ఇప్పటికే విజయ్‌కు నెరేట్ కూడా చేశాడని తెలుస్తోంది. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ఇటీవల వీరసింహారెడ్డి మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.

Vijay Leo : విజయ్ ‘లియో’లో విజయ్ సేతుపతి ఉన్నాడా?

ఇప్పుడు విజయ్‌తో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయాలని గోపీచంద్ మలినేని చూస్తున్నాడు. మరి గోపీచంద్‌తో సినిమాకు విజయ్ ఓకే చెబుతాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో సినిమా అనే వార్త కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.