Waltair Veerayya: ఫ్యాన్స్‌కు వీరయ్య గిఫ్ట్.. ఆ ఐకానిక్ డ్యాన్స్ స్టెప్‌తో థియేటర్లు దద్దరిల్లిపోనున్నాయి!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమా ట్రైలర్, ప్రీరిలీజ్ ఈవెంట్‌లతో ప్రేక్షకులకు మరింత ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

Waltair Veerayya: ఫ్యాన్స్‌కు వీరయ్య గిఫ్ట్.. ఆ ఐకానిక్ డ్యాన్స్ స్టెప్‌తో థియేటర్లు దద్దరిల్లిపోనున్నాయి!

Waltair Veerayya To Have Chiranjeevi Iconic Dance Step

Updated On : January 6, 2023 / 4:06 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమా ట్రైలర్, ప్రీరిలీజ్ ఈవెంట్‌లతో ప్రేక్షకులకు మరింత ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

Waltair Veerayya : ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసిన వాల్తేరు వీరయ్య..

ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీలోని ఓ పాటలో చిరంజీవి చేయబోయే డ్యాన్స్ స్టెప్ గురించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరు తన ఐకానిక్ వీణ స్టెప్పును మరోసారి వేయబోతున్నాడట. ఇంద్ర సినిమాలో ‘‘దాయి దాయి దామ్మా..’’ పాటలో చిరు వేసిన వీణ స్టెప్పు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. ఆ తరువాత చిరు ఎన్ని కొత్త స్టెప్పులు వేసినా, దాని క్రేజ్ మాత్రం తగ్గలేదు.

Waltair Veerayya: రన్‌టైమ్ లాక్ చేసుకున్న వాల్తేరు వీరయ్య.. ఎంతో తెలుసా?

అయితే ఇప్పుడు చిరంజీవి మరోసారి ఆ వీణ స్టెప్పును వాల్తేరు వీరయ్య సినిమాలో వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓ పాటలో చిరు ఈ ఐకానిక్ స్టెప్పును వేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో చిరు వీణ స్టెప్పు ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.