Prabhas 24: ప్రభాస్‌తో నటించాలని ఉందా.. అయితే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

ఈ మధ్య కాలంలో మన సినీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలనే కాదు.. భారీ క్యాస్టింగ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాల కోసం కొత్త వారికీ అవకాశం కల్పిస్తున్నారు.

Prabhas 24: ప్రభాస్‌తో నటించాలని ఉందా.. అయితే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

Prabhas 24

Prabhas 24: ఈ మధ్య కాలంలో మన సినీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలనే కాదు.. భారీ క్యాస్టింగ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాల కోసం కొత్త వారికీ అవకాశం కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా కొత్త వారి కోసం క్యాస్టింగ్ కాల్ విడుదల చేసి ఆడిషన్స్ తీసుకొని ఎంపిక చేసి తీసుకుంటున్నారు. ఇది ఒకవైపు సినిమా ప్రమోషన్ తో పాటు సినిమాలో కొత్త వారికి అవకాశం దక్కడంతో బాగా వర్క్ అవుట్ అవుతుంది.

అందుకే, ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తికాగా ఆదిపురుష్, సలార్ సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇవి పూర్తికాక ముందే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు ప్రభాస్. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరొయిన్ కాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాలోనే కొత్త వారి కోసం ఆడిషన్స్ జరపడం విశేషం.

నాగ్ అశ్విన్ సినిమా కోసం ఇప్పటికే ప‌లు ఆడిష‌న్స్ నిర్వ‌హించగా ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆడిషన్స్ పెడుతున్నట్టు తెలిపారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న వారు 12, 15 తేదీల్లో ఆడిష‌న్స్‌కి హాజ‌రు కావ‌చ్చని మేకర్స్ తెలిపారు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై ఇండియా సినీపరిశ్రమలో ఉత్కంఠ మొదలవగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి ప్రాజెక్టులో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..