Bangladesh vs India: బంగ్లాదేశ్ చేరుకున్న టీమిండియా.. వీడియో

Bangladesh vs India: బంగ్లాదేశ్ చేరుకున్న టీమిండియా.. వీడియో

Bangladesh vs India

Updated On : December 2, 2022 / 5:30 PM IST

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఎల్లుండి నుంచి వన్డే మ్యాచులు ప్రారంభం కానున్నాయి. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. విమానాశ్రయం చేరుకున్న అనంతరం బస్సులో టీమిండియా హోటల్ కు వెళ్లింది. షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది.

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచులు కూడా ఆడనుంది. టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీఫైనల్ లో ఓడిన అనంతరం న్యూజిలాండ్ లో పర్యటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ సిరీస్ లో టీమిండియా తాత్కాలిక కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించారు. బంగ్లాదేశ్ పర్యటనలో మళ్లీ రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.

Ricky Ponting: కామెంటరీ చేస్తున్న సమయంలో రికీ పాంటింగ్‌కు గుండెపోటు?.. ఆసుపత్రికి తరలింపు

న్యూజిలాండ్ పర్యటనలో టీ20 మ్యాచులను టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో, వన్డే మ్యాచులను శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడింది. బంగ్లాదేశ్ పర్యటనలో మళ్ళీ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా మ్యాచులు ఆడనుంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కూడా బంగ్లా పర్యటనలో ఉన్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..