Maharashtra: అలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని గ్ర‌హించాం: ఏక్‌నాథ్ షిండే

నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నులు చేయాలంటూ తాము ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌తో ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ద్ద‌కు వెళ్ళామ‌ని అన్నారు. లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌ని గ్ర‌హించి తాము ఈ విష‌యాన్ని ఉద్ధ‌వ్‌కు చెప్పామ‌ని వివ‌రించారు.

Maharashtra: అలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని గ్ర‌హించాం: ఏక్‌నాథ్ షిండే

Maharashtra

Maharashtra: బాల్ ఠాక్రే హిందుత్వ‌కు తాము క‌ట్టుబ‌డి ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే అన్నారు. త‌మ ఎమ్మెల్యేల నియోజ‌క వ‌ర్గాల అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఆయ‌న మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏక్‌నాథ్ షిండే మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. త‌న వ‌ద్ద 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని చెప్పారు.

Maharashtra: మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. నేడే ప్ర‌మాణ స్వీకారం: ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌ట‌న‌

నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నులు చేయాలంటూ తాము ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌తో ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ద్ద‌కు వెళ్ళామ‌ని అన్నారు. లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌ని గ్ర‌హించి తాము ఈ విష‌యాన్ని ఉద్ధ‌వ్‌కు చెప్పామ‌ని వివ‌రించారు. అలాగే, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల‌ని డిమాండ్ చేశామ‌ని అన్నారు. బీజేపీ 120 సీట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌లేక‌పోయార‌ని ఆయ‌న చెప్పారు. బాల్ ఠాక్రేకి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌నైన త‌న‌ను మ‌హారాష్ట్రకు సీఎంను చేస్తున్నందుకు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌తో పాటు ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇత‌ర బీజేపీ నేత‌ల‌కు తాను కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని తెలిపారు.