Covid Variant BF.7 : మాస్కులు మస్ట్, బూస్టర్ డోస్ తీసుకోవాలి- కరోనా కొత్త వేరియంట్‌పై కేంద్రం హెచ్చరిక

ప్రజలంతా మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడటం, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి. ప్రజలంతా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలి అని మంత్రి చెప్పారు.

Covid Variant BF.7 : మాస్కులు మస్ట్, బూస్టర్ డోస్ తీసుకోవాలి- కరోనా కొత్త వేరియంట్‌పై కేంద్రం హెచ్చరిక

Covid Variant BF.7 : కరోనా కొత్త వేరియంట్ BF.7 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ దడ పుట్టిస్తోంది. భారత్ లోనూ కొత్త వేరియంట్ కలకలం రేపింది. కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు పలు జాగ్రత్తలు చెప్పింది. కీలక సూచనలు చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

దేశంలో కరోనా కొత్త వేరియంట్ BF.7 కేసులు వచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ హెచ్చరించారు. ”రానున్నది పండుగల సీజన్. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. ఆ సమయంలో ప్రజలంతా మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడటం, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి. ప్రజలంతా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలి” అని మంత్రి చెప్పారు.

Also Read..Bharat Biotech Nasal Covid Vaccine : భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్ వ్యాక్సిన్.. బూస్టర్ డోస్‌గా అందించనున్న కేంద్రం

చైనాలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేసింది. మాస్క్ లు విధిగా ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరించకపోవడం, భౌతిక దూరం.. ఇలాంటి చర్యలను పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. కాకపోతే ఇవి ముందు జాగ్రత్త కోసం చేసినవే. చైనాలో కేసుల తీవ్రతను చూసి మనం భయపడక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే.. మన దగ్గర ఇప్పటికే మూడు విడతలు కరోనా వ్యాప్తి చెందడం, దాదాపు అందరూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, ఎక్కువ మంది రెండు డోసుల టీకాలు తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కనుక మరో మరో విడత కరోనా రిస్క్, మరణాల రేటు అంతగా ఉండకపోవచ్చన్నది నిపుణుల విశ్లేషణ.

Also Read..BF7 Omicron Variant : బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ తో ముప్పు ఎక్కువే.. ఒకరి నుంచి 18 మందికి వేగంగా వ్యాప్తి, వైరస్ లక్షణాలేంటి?

బీఎఫ్-7.. ఇప్పుడీ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మూడేళ్ల పాటు యావత్ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి సద్దుమణిగిందని అనుకునే లోపే… ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. చైనాలో ఇప్పుడు నెలకొన్న భయానక పరిస్థితులకు ఈ కొత్త వేరియంటే కారణం. బీఎఫ్-7 రకాన్ని భారత్ లోనూ గుర్తించడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో బీఎఫ్-7 వేరియంట్ లక్షణాలను నిపుణులు వెల్లడించారు. సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయని, కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన దగ్గు, అలసట, ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.