Weather update: తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు.. ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది?

కూనవరం, వీఆర్ పురం పునరావాస కేంద్రాలను అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మిశ్రా సందర్శించారు.

Weather update: తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు.. ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది?

Weather update

Updated On : July 20, 2023 / 4:39 PM IST

Weather update – Telangana: హైదరాబాద్ (Hyderabad) సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rainfall) కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది.

ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 99,237 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో ఉదయం నుంచి ఇప్పటివరకు 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 68.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

భద్రాచలం వద్ద గోదావరి వరద 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా. గోదావరి నుంచి 9,32,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అల్లూరి జిల్లా కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం కూనవరం వద్ద 43 అడుగులకు వరద నీరు చేరుకుంది. కూనవరం, వీఆర్ పురం పునరావాస కేంద్రాలను అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మిశ్రా సందర్శించారు.

Heavy rains : తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు… విద్యాసంస్థలకు సెలవులు