Prashant Kishor: ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ లో ఎందుకు చేరడం లేదు? కారణం ఇదేనా

ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రకటించారు.

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ లో ఎందుకు చేరడం లేదు? కారణం ఇదేనా

Congress

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ లో చేరే అంశంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. గత కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశమైన ఈ అంశంలో అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు ప్రశాంత్ కిశోర్..స్పష్టమైన నిర్ణయం ప్రకటించారు. ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రకటించారు. అయితే వ్యూహకర్తగా, సలహాదారుడిగా ప్రశాంత్ ఇచ్చిన సూచనలు సలహాలు పార్టీకి ఎంతో ఉపయోగపడుతాయని సుర్జేవాలా పేర్కొన్నారు. అనంతరం అరగంట వ్యవధిలోనే పీకే సైతం ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ను తాను తిరస్కరించినట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.

Also read:KA Paul On Telangana : తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే-కేఏ పాల్ హాట్ కామెంట్స్

అయితే గత పది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ తిరిగిన ప్రశాంత్ కిశోర్ ఇలా ఉన్నట్టుండి బ్యాక్ స్టెప్ వేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. “ప్రశాంత్ కిశోర్ నేడో రేపో కాంగ్రెస్ లో చేరనున్నారు” అనే శీర్షిక నుంచి “పార్టీలో చేరడం లేదంటూ” మారిన పరిణామాలు ఏమై ఉంటాయని విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ వెనకడుగుపై కాంగ్రెస్ ముఖ్యనేతలు స్పందిస్తూ..ఈ విషయంలో పీకే నుంచి పార్టీకి జరిగే నష్టం ఏమి లేదని, అదే సమయంలో ప్రాంతీయ నేతలకు వ్యతిరేకంగా పార్టీ ఎక్కడ పడితే అక్కడ గొడవలు సృష్టించడం ఇష్టంలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Also read:CM Stalin : ‘జస్ట్ పోస్ట్‌మ్యాన్ ప‌ని చేయండి చాలు’ సీఎం స్టాలిన్

మరోవైపు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్..పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో తన ఐ- ప్యాక్ సంస్థ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్నారని..దీంతో అతనిపై విశ్వాసం లోపించిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానంకు సూచించారు. అదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన పవర్ ప్రెజంటేషన్ లో..కొన్ని అమలు చేయలేని సూచనలు చేశాడు ప్రశాంత్ కిశోర్. ప్రధానంగా పార్టీలో 70 ఏళ్లు పైబడిన వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తే ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఆ సూచనల సారాంశం. ఇది మింగుడు పడని కొందరు సీనియర్ నేతలు ప్రశాంత్ ను పక్కనబెట్టాలని అధిష్టానానికి సూచించారట.

Also read:Prashant Kishor: కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన పీకే!

ఇక ఇటీవల ప్రగతి భవన్లో మూడు రోజుల పాటు తిష్ట వేసిన ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్ అధిష్టానంతోనూ రహస్య మంతనాలు జరిపారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో ఐప్యాక్ సేవలు వినియోగించుకోనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో సందిగ్ధంలో పడ్డ కాంగ్రెస్ పార్టీ..ప్రశాంత్ ఈ రెండు వ్యవహారాలను ఎలా నడిపిస్తారు అనే విషయంపై కాస్త ఆలోచనలో పడింది. ఆమేరకు ఎన్నికల వ్యూహకర్తగానే ప్రశాంత్ కిశోర్ సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావించి..ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read:delhi high court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. కుమార్తెను కలిసేందుకు అనుమతి