WI vs IND Test Match: తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం.. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలం.. తక్కువ స్కోర్‌కే కుప్పకూలిన వెస్టిండీస్ ..

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు భారత్ హవా సాగింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలంకు విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు.

WI vs IND Test Match: తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం.. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలం.. తక్కువ స్కోర్‌కే కుప్పకూలిన వెస్టిండీస్ ..

WI vs IND Test Match

WI vs IND Test Match: వెస్టిండీస్‌ (West Indies) తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ (Test series) లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ను టీమిండియా (Team india) ఘనంగా ఆరంభించింది. అశ్విన్ (Ashwin), జడేజా (Jadeja) స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాటర్లు  (West Indies Batters) క్రీజులో నిలిచేందుకు ఇబ్బంది పడ్డారు. వరుస వికెట్లతో అశ్విన్ విజృంభించడంతో వెస్టిండీస్ జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో అరంగ్రేటం ఆటగాడు అథనేజ్ (47) మినహా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేక పోయారు. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా తేజ్ నారాయణ్ చందర్‌పాల్, కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌లు క్రీజులోకి వచ్చారు. తొలి పది ఓవర్లు వికెట్లు కోల్పోయికుండా వారిద్దరూ జాగ్రత్తగా ఆడారు. ఆ తరువాత అశ్విన్ బాల్ అందుకోవటంతో నిలకడగా ఆడుతున్న త్యాగ్ నారాయణ్ చందర్‌పాల్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే బ్రాత్ వైట్ (20) అశ్విన్ బౌలింగ్ లోనే రోహిత్ శర్మకు చిక్కాడు. అశ్విన్ స్పిన్ దెబ్బకు ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ బాట‌పట్టారు.

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌.. తండ్రీకొడుకును ఔట్ చేసిన మొన‌గాడు

47 పరుగుల వద్ద వెస్టిండీస్ మూడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రీఫర్ (2) వికెట్ కీపర్ ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 28వ ఓవర్లో బ్లాక్‌వుడ్ (14)ను జడేజా ఔట్ చేశాడు. దీంతో తొలి సెషన్‌లో వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. రెండో సెషన్‌లోనూ విండీస్ ఆటగాళ్లు ఏ మాత్రం క్రీజులో నిలవలేక పోయారు. వెస్టిండీస్ జట్టు టీ బ్రేక్ సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఆ తరువాత కొద్దిసేపటికే 150 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లు రవిచంద్ర అశ్విన్ ఐదు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు.

WI vs IND : విరాట్ కోహ్లిని అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన వెస్టిండీస్ బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. జైస్వాల్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. 15.5 ఓవర్లుకు వికెట్ నష్టపోకుండా టీమిండియా 66 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం కారణంగా మ్యాచ్ కొద్ది సేపు నిలిచిపోయింది. వర్షం ఆగిపోవటంతో మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్, జైస్వాల్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి రోహిత్ శర్మ (30 నాటౌట్), యశస్వీ జైస్వాల్ (40 నాటౌట్) క్రీజులో ఉన్నారు.