Asaduddin Owaisi: అయితే నన్ను చంపుతారా?.. కర్ణాటక సీఎం బొమ్మైకి అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న

మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్‭.. కర్ణాటక రాజకీయాల్లో గతంలో పెద్దగా చర్చకు వచ్చేవారు కాదు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రోజూ నానుతూనే ఉంటారు. టిప్పు సుల్తాన్‭కు మద్దతుగా కాంగ్రెస్, తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ఏవో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాయి. టిప్పు సుల్తాన్‭ను పొగిడేవారు హిందూ వ్యతిరేకులని విపక్షల్ని కార్నర్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటుంది

Asaduddin Owaisi: అయితే నన్ను చంపుతారా?.. కర్ణాటక సీఎం బొమ్మైకి అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న

Will you kill me?.. Owaisi takes a dig at Karnataka CM

Updated On : February 19, 2023 / 10:43 AM IST

Asaduddin Owaisi: కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న సావర్కర్, టిప్పు సుల్తాన్ కాంట్రవర్సీపై ఏఐఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాను టిప్పు సుల్తాన్‭కు మద్దతు ఇస్తానని, అలా ఇస్తే తనను చంపేస్తారా అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని ప్రశ్నించారు. విపక్ష నేతలను బొమ్మై తరుచూ టిప్పు సుల్తాన్ వారసులంటూ విమర్శిస్తుంటారు. ఇక అధికార భారతీయ జనతా పార్టీ నేతలు సైతం ఇదే తరహాలో స్పందిస్తుంటారు. చాలాకాలంగా రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేపట్టేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దాన్ని రద్దు చేశారు.

Uddhav Thackeray: ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక ఈ సంఘటనలన్నింటినీ ఓవైసీ గుర్తు చేస్తూ ‘‘నేను టిప్పు సుల్తాన్‭కు మద్దతు ఇస్తాను. నేను ఆయనను గౌరవిస్తాను. చెప్పండి, నన్ను చంపేస్తారా? బొమ్మైని నేను అడుగుతున్నాను. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కుల్ని ఇచ్చింది. ఎవరికి నచ్చిన వారిని వారు గౌరవించుకుంటారు. కానీ బీజేపీకి అవి గిట్టడం లేదు. టిప్పు సుల్తాన్‭ను వ్యతిరేంచేవారు సమాజంలో విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు, అల్లర్లు సృష్టిస్తున్నారు. మారణహోమానికి పాల్పడుతున్నారు’’ అని ఓవైసీ అన్నారు.

Meghalaya: ఆ ఈవీఎం‭లో ఏ బటన్ నొక్కినా ఓటు మాత్రం బీజేపీకే, వీడియో షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకో తెలుసా?

మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్‭.. కర్ణాటక రాజకీయాల్లో గతంలో పెద్దగా చర్చకు వచ్చేవారు కాదు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రోజూ నానుతూనే ఉంటారు. టిప్పు సుల్తాన్‭కు మద్దతుగా కాంగ్రెస్, తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ఏవో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాయి. టిప్పు సుల్తాన్‭ను పొగిడేవారు హిందూ వ్యతిరేకులని విపక్షల్ని కార్నర్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటుంది. అయితే పాలనకు, ప్రజాశ్రేయస్సుకు కులం, మతం ఉండదని, కీర్తి గొప్పదని కాంగ్రెస్ పార్టీ రివర్స్ అటాక్ చేస్తుంటుంది.

Tarakaratna Wife : తారకరత్న భార్య కూడా సినీ పరిశ్రమే.. తారక్, అలేఖ్య లవ్ స్టోరీ తెలుసా??