UP Cabinet Expansion : యూపీ కేబినెట్ విస్తరణ..జితిన్ ప్రసాదకు చోటు

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ...రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది.

UP Cabinet Expansion : యూపీ కేబినెట్ విస్తరణ..జితిన్ ప్రసాదకు చోటు

Up

UP Cabinet Expansion వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ…రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ.. కేబినెట్​ను పునర్​వ్యవస్థీకరించింది.

యోగి ఆదిత్య‌నాథ్ మంత్రివ‌ర్గంలో ఇప్ప‌టికే 53 మంది ఉండ‌గా..కొత్త‌గా మ‌రో ఆరుగురిని తీసుకున్నారు. ఓటర్లపై ప్రభావం చూపే కీలక నేతలకు కేబినెట్​లో స్థానం కల్పించింది. కొత్త మంత్రుల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్ ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ల‌క్నోలోని రాజ్‌భ‌వ‌న్‌లో ఇవాళ ఈ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. కొత్త‌గా మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టిన ఆరుగురిలో ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద కూడా ఉన్నారు.

READ  భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయ్ తెలుసా

జితిన్ ప్ర‌సాద జూన్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వ‌చ్చారు.బ్రాహ్మణ వర్గం ఓటర్లపై ఈయనకు మంచి పట్టుంది. యూపీలో బ్రాహ్మ‌ణ ఓటు బ్యాంకు 13 శాతం ఉంది. బ్రాహ్మణ వర్గం ఓటర్లపై ఈయనకు మంచి పట్టుంది. ఇది తమకు కలిసొస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ప్రసాదతో పాటు ఛత్రపాల్ సింగ్ గంగ్వార్, పల్తూ రామ్, సంగీత బల్వంత్, సంజీవ్ కుమార్, దినేశ్ ఖాటిక్, ధరమ్​వీర్ సింగ్​ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.