UP madrasas: సీఎం యోగి మరో కీలక నిర్ణయం.. మదర్సాలలో జాతీయ గీతం తప్పనిసరి!

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి వరస సంచలనాలకు తెరతీస్తున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసిన యోగీ ఆదిత్యనాథ్ అంతే దూకుడుగా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.

UP madrasas: సీఎం యోగి మరో కీలక నిర్ణయం.. మదర్సాలలో జాతీయ గీతం తప్పనిసరి!

Up Madrasas

UP madrasas: ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి వరస సంచలనాలకు తెరతీస్తున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసిన యోగీ ఆదిత్యనాథ్ అంతే దూకుడుగా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే మసీదులపై లౌడ్ స్పీకర్ల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయంటూ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విమర్శలు రావడంతో అన్ని ప్రార్ధనా స్ధలాలపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు కావడం లేదన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి.

CM yogi adityanath : 28 ఏళ్లకు సొంతూరికొచ్చి..తల్లి ఆశీస్సులు తీసుకున్న సీఎం యోగీ ఆదిత్యానాథ్

అదలా ఉండగానే ఇప్పుడు సీఎం యోగి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిధుల సహాయంతో నడిచే మదర్సాలలో ఇక నుంచి జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతోరోజ క్లాసులు ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతం పాడాలని ఆదేశించారు. యోగీ నిర్ణయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి స్వాగతిస్తూ.. దీని వల్ల విద్యార్ధులలో జాతీయతా భావాన్ని పెంచినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.

Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం

మదర్సాల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయాలంటూ ఎప్పటినుంచో యూపీలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా ఫైనల్ గా ఇప్పుడు ఇందుకు అనుగుణంగా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్ర మదర్సా బోర్డు కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని అమలుచేయాలంటూ అన్ని మదర్సాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మదర్సాలన్నీ తప్పనిసరిగా ఉదయం క్లాసులు ప్రారంభం కాకముందు జాతీయ గీతం ఆలాపించేలా విద్యార్ధుల్ని సంసిద్ధం చేస్తున్నాయి.