ఆ బంధం కారణంగా మోసపోతున్న వారిలో భర్తలే ఎక్కువ

ఆ బంధం కారణంగా మోసపోతున్న వారిలో భర్తలే ఎక్కువ

భారత వివాహ వ్యవస్థలో తీరుతెన్నులు మారుతున్నాయి. వంటింటి కుందేళ్లు అని పేరు తెచ్చుకున్న భార్యమణులు బయటకు వచ్చి సంసారాన్ని చక్కబెడుతున్నారు. ఇంతవరకూ ఓకే.. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత భాగస్వామిని మోసం చేయడంలోనూ తామే ముందంజలో ఉన్నారట. పెళ్లైన వారిలో 56శాతం ఆడవాళ్లే ఒక్కసారైనా భర్తను మోసం చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. 

భారత తొలి ఎక్స్‌ట్రా మ్యారీషియల్ డేటింగ్ యాప్ ఆధారంగా చేసిన సర్వేలో 48శాతం ప్రజలు ఒకేసారి ఇద్దరితో లవ్‌లో ఉంటున్నారు. 46శాతం మంది ఇంకా లవ్ లో ఉండికూడా మోసానికి పాల్పడుతున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే తమ భాగస్వామికి ఇతరులతో సంబంధం ఉందని తెలిసినప్పటికీ 7శాతం మంది క్షమించి వదిలేస్తున్నారు. ముందుగా ఎఫైర్ గురించి తెలిసి గొడవలు అయినా 69శాతం మంది కాంప్రమైజ్ అయి కాపురాలు చేసేసుకుంటున్నారు. 

ఈ రీసెర్చ్‌లో ఒక వెయ్యి 525మంది పాల్గొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై. హైదరాబాద్, పూణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో 25నుంచి 50ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారిపై ఇది నిర్వహించారు. ఏప్రిల్ 2017లో భారత్‌కు వచ్చిన గ్లీడెన్ తమ వద్ద 8లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నట్లు చెప్పారు. 2018 సుప్రీం కోర్టు వివాహ బంధంలో సమానతల గురించి తీర్పు చెప్పిన తర్వాత అమాంతం మెంబర్స్ పెరిగిపోయారని అన్నాడు. 

90శాతం మంది భారత వివాహ వ్యవస్థకు అంకితమై ఉంటే కేవలం 5శాతం మంది మాత్రమే ప్రేమ వివాహాల జోలికి పోతున్నారట. అందులో ప్రతి వెయ్యి మంది జంటల్లో 13పలు కారణాలుగా విడిపోతున్నారట. 49శాతం మంది వివాహేతర సంబంధానికి మొగ్గు చూపుతుంటే 10మందిలో 5మంది కేవలం సెక్స్ కోసమే ఇతర పార్టనర్స్ ను కోరుకుంటున్నారు. వీరిలో 53శాతం మంది మహిళలు ఇతరులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. 

భారత స్త్రీలు రొమాన్స్ విషయంలో ఓపెన్ మైండ్‌తో గడిపేస్తున్నారు. గ్లీడెన్ 
సర్వీసు ఓపెన్ మైండ్‌తో ఉండే వారు కొత్త లవ్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చంటూ అవకాశమిస్తోంది. దాంతో పాటు పూర్తి ప్రైవసీ ఇస్తుండటంతో యథేచ్ఛగా రిలేషన్ కొనసాగించేస్తున్నారు. ప్రైవసీ కాపాడుకుంటూ ఉండటంతో రోజూ పెద్ద సంఖ్యలో లేడీస్‌ను ఆకర్షిస్తూ గ్లీడెన్ బిజినెస్ చేసుకుంటుంది.