Increase Appetite Naturally : ఆకలిలేక ఏం తినలేకపోతున్నారా? సహాజంగా ఆకలిని పెంచే ఇంటి ఔషదాల గురించి తెలుసుకోవాల్సిందే!

ఆకలి లేక ఇబ్బంది పడేవారు రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. లేదా ఖర్జూరం రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క‌ను పొడి చేసి అందులో కొద్దిగా చక్కెర, సరిపడినంత తేనె కలిపి రోజూ తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

Increase Appetite Naturally : ఆకలిలేక ఏం తినలేకపోతున్నారా? సహాజంగా ఆకలిని పెంచే ఇంటి ఔషదాల గురించి తెలుసుకోవాల్సిందే!

hungry and can't eat anything

Increase Appetite Naturally : ఆకలి లేకపోవటం అన్న సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. వాస్తవానికి ఆకలి పెరిగిన లేదా తగ్గినా ఒక రుగ్మతగా నిపుణులు చెబుతుంటారు. అయితే కొంత మందిలో ఆకలి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఏమి తినాలని అనిపించదు. ఆకలి లేకపోవటం వంటివి అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలో గమనించవచ్చు. ఆత్రుతగా, ఆందోళనగా ఉన్నప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ ఒక రకమైన ఒత్తిడికి గురి చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాంటి సందర్భంలో జీర్ణక్రియ, ఆకలిని మందగించడంతో సహా అనేక విధాలుగా ప్రభావం చూపిస్తాయి. వృద్ధాప్యంలో ఉన్నవారికి జీర్ణవ్యవస్థ మందగించడం వల్ల ఆ సమయంలో తక్కువ ఆకలి ఉంటుంది.

ఇదిలా వుంటే చాలా మంది ఆకలిని పెంచుకునేందుకు టానిక్ లు, మందులు వంటివి తీసుకుంటుంటారు. అయితే అందరికి తెలియని విషయమేంటంటే సహజంగానే మన ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆరోగ్యకరంగా ఆకలిని పెంచుకోవచ్చు, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

దానిమ్మ పండు రసం ; మీ ఆకలిని పెంచే ఇంట్లో ఉండే ఔషదాలను తీసుకోటానికి ఇబ్బందిగా అనిపిస్తే, దానిమ్మ పండు రసాన్ని తీసుకోండి. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్’లను కలిగి ఉన్న దానిమ్మ పండు రసం జీర్ణక్రియ శక్తి ప్రేరేపించటమే కాకుండా, ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ రసంలో సగం చెంచా తేనెను కలుపుకోండి.

ఉసిరి ; ఇండియన్ గూస్పెర్రీ గా పిలవబడే ఉసిరి ఆకలిని పెంచే సహజ ఔషదంగా పని చేస్తుంది. ఉసిరి, జీర్ణక్రియ వ్యవస్థ యొక్క పని తీరును మరియు కాలేయాన్ని నిర్విషీకరణకు గురిచేసి ఆకలిని పెంచుతుంది. తేనె మరియు ఉసిరి కలిపినా లేదా ఉసిరితో తయారు చేసిన ఉరగాయను తినండి.

అల్లం ; ఆకలిని పెంచే శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషదాలలో అల్లం కూడా ఒకటిగా చెప్పవచ్చు, అంతేకాకుండా, ఈ ఔషదం అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి అల్లం తినటం వలన లేదా ఆహార తయారీలో వాడటం వలన ఆకలి పెరుగుతుంది. రోజులో 3-4 సార్లు అల్లం టీ తాగటం వలన లాలాజలం శక్తివంతంగా మారుతుంది మరియు జీర్ణక్రియ రసాలు ఉత్పత్తి అధికమమై, ఆకలి కూడా మెరుగుపడుతుంది.

నిమ్మ ; నిమ్మరసం, ఆకలిని ఎంతగానో పెంచుతుంది. నిమ్మకాయ నుండి రసాన్ని పిండి లేదా సలాడ్’లలో కలిపుకొని తినటం వలన ఆకలి పెరుగుతుంది. లేదా రోజులో రెండు సార్లు రెండు గ్లాసుల నిమ్మరసం తాగటం వలన మీ ఆకలిని పెరుగుతుంది.

కొత్తిమీర ; కొత్తిమీర, జీర్ణక్రియ ఎంజైమ్’ల ఉత్పత్తిని అధికం చేసి, సహజ సిద్దంగా ఆకలిని పెంచుతుంది. రోజు ఉదయాన, ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కొత్తిమీర రసాన్ని తాగటం వలన ఆకలి సులువుగా పెరుగుతుంది.

చింతపండు ; ఆకలిని పెంచే లేదా ఉత్ప్రేరకాలలో చింతపండు గుజ్జు విస్తృతంగా వాడే ఇంట్లో ఉండే ఔషదంగా చెప్పవచ్చు. భారతదేశంలో చాలా రకాల వంటకాలలో మంచి రుచిని ఆపాదించటానికి చింతపండును వాడుతుంటారు. రోజు తయారు చేసుకునే వంటకాలలో ఎక్కువ మొత్తంలో కలపుకోవటం వలన మీ ఆకలి పెరుగుతుంది.

నల్ల మిరియాలు ; నల్ల మిరియాలను జీర్ణక్రియ శక్తిని పెంచే ఔషదంగా వాడతారు అని తెలిసిందే. రుచి గ్రాహకాలను ఉత్తేజపరచి, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ (HCL) ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియను వేగవంతం చేయటం వలన, ఆకలి పెరుగుతుంది

వీటితోపాటుగా ఆకలి లేక ఇబ్బంది పడేవారు రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. లేదా ఖర్జూరం రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క‌ను పొడి చేసి అందులో కొద్దిగా చక్కెర, సరిపడినంత తేనె కలిపి రోజూ తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. మెంతుల‌ను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని గ్యాస్ ఇట్టే బయటకు వెళ్తుంది. ఇలా చేయడం కూడా ఆకలి పెంచుతుంది.

ప్రతి రోజూ ఉదయం కొద్దిగా మెంతిపొడిలో తేనె కలిపి తీసుకోవడం మంచిది. పెరుగులో కలిపి కూడా తినొచ్చు.ద్రాక్ష పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయం చేస్తుంది. భోజనం చేశాక ద్రాక్ష పండ్లను తింటే జీర్ణం బాగా అవడమే కాకుండా ఆకలి కూడా బాగా వేస్తుంది.