Hair Dye : జుట్టుకు హెయిర్ డై వాడుతున్నారా!..తప్పక తెలుసు కోవాల్సిందే…

జుట్టు రంగులలో సాధారణంగా ఉపయోగించే బి-ఫెనిలెనెడిమైన్, మూత్రాశయ క్యాన్సర్, ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాల సమస్యలతో ముడిపడి ఉంది.

Hair Dye : జుట్టుకు హెయిర్ డై వాడుతున్నారా!..తప్పక తెలుసు కోవాల్సిందే…

Hair Color

Hair Dye : తెల్ల జుట్టును కవర్ చేసేందుకు, జట్టును అందంగా మార్చేందుకు చాలా మంది వివిధ రకాల హెయిర్ డై లు వినియోగిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగి పోయింది. నిజాని జుట్టు నల్లగా ఉన్న ఫ్యాషన్ కోసం వాటికి రంగులద్ధే సంస్కృతి పెరిగి పోయింది. సహజ సిద్ధమైన జుట్టును రసాయనాలతో కూడిన రంగులో వేయటం వల్ల జుట్టుకే కాకుండా శరీర ఆరోగ్యంపై కూడా వాటి ప్రభావం పడుతోంది. పురుషులు, మహిళలు ఇటీవలి కాలంలో హెయిర్ డైను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. వీరి పోకడకు తగ్గట్లు అటు అనేక కంపెనీలు వివిధ రకాల హెయిర్ డైలతో మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి.

హెయిర్ డై లలో ఉండే అమ్మోనియా, హెయిర్ ఫార్మాల్డిహైడ్, బి-ఫినైల్నెడిమిన్ , బొగ్గు తారు, రెసోర్సినాల్, యూజీనాల్ ఉంటాయి. ఈ రసాయనాలు మీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. జుట్టు రంగులలో బ్లీచ్ సృష్టించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనానికి అమ్మోనియా కలుపుతారు. ఈ రసాయనాలకు గురికావడం వల్ల ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

రెసోర్సినాల్ అనేది జుట్టు రంగులలో ఉపయోగించే మరొక రసాయనం. యూరోపియన్ జర్నల్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, హెయిర్ డైని దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల మహిళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. హెయిర్ డైలోని బి-ఫెనిలెనెడిమిన్ అనే రసాయనాన్ని చర్మంలోకి వెళ్ళటం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి.

జుట్టు రంగులలో సాధారణంగా ఉపయోగించే బి-ఫెనిలెనెడిమైన్, మూత్రాశయ క్యాన్సర్, ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాల సమస్యలతో ముడిపడి ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నెలకు ఒకసారి హెయిర్ డైని ఉపయోగించే వ్యక్తులకు మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఫార్మాల్డిహైడ్, బొగ్గు , సీసం అసిటేట్ మరియు ఇతర హానికరమైన రసాయనాలు మూత్రాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతాయి. గర్భధారణ సమయంలో జుట్టుకు హెయిర్ డై ఉపయోగించడం తల్లి మరియు పుట్టబోయే బిడ్డకు హానికరం. పాలిచ్చే తల్లులకు ప్రమాదకరమని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రైకాలజీలో జరిగిన అధ్యయనంలో తేలింది.