Bathukamma 2023 : రెండో రోజు పూల సంబురంలో ‘అటుకుల బతుకమ్మ’.. ప్రత్యేకతలేంటే తెలుసా..?

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను చేసుకున్న ఆడబిడ్డలు రెండో రోజు అంటే ఈరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మను అందంగా తీర్చి దిద్దుతారు.

Bathukamma 2023 : రెండో రోజు పూల సంబురంలో ‘అటుకుల బతుకమ్మ’.. ప్రత్యేకతలేంటే తెలుసా..?

Bathukamma 2023

Bathukamma 2023..Atukula bathukamma :  పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల పండుగలో బతుకమ్మలో ఒదిగిపోయే పువ్వులు పండుగ బతుకమ్మ పండుగ సంబురాలతో తెలంగాణ రంగుల శోభాయమాయంగా మారిపోయింది. ఆడబిడ్డల ఆటపాటలతో పూల గుభాళింపుతో కనువిందు చేస్తోంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మల పండుగ కొసాగుతుంది.

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను చేసుకున్న ఆడబిడ్డలు రెండో రోజు అంటే ఈరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి అందంగా తీర్చి దిద్దుతారు.. గౌరమ్మ పాటలతో రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగ వేడుకగా చేసుకుంటారు.

Bathukamma 2023 : బతుకమ్మ సిగలో ‘గుమ్మడి పువ్వు’ పసుపు గౌరమ్మ కొలువు

రెండో రోజు జరుపుకొనే బతుకమ్మ అటుకుల బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ తరువాత రోజు చిన్నారులే ఎక్కువగా బతుకమ్మ ఆడుకునేవారట. చిన్నపిల్లల ఆటపాటలంటే పప్పు బెల్లాలే కదా..అందుకే రెండో రోజు బతుకమ్మ ఆటలో అటుకుల బతుకమ్మగా చేసుకుంటారు. అమ్మవారికి నైవేధ్యంగా అటుకులు, బెల్లం పెడతారు.