Ads : యాడ్స్ వల్ల ట్రోల్ల్స్ కి గురవుతున్న సెలెబ్రిటీలు

సినిమా సెలెబ్రిటీలు ఫేమ్ ఉన్నప్పుడు యాడ్స్ చేస్తూ ఉంటారు. యాడ్స్ వల్ల కూడా బాగానే సంపాదిస్తారు. ఇప్పుడున్న చాలా మంది హీరోలు, హీరోయిన్లు యాడ్స్ చేస్తున్న వాళ్ళే. అయితే వాళ్ళు చేసే

Ads : యాడ్స్ వల్ల ట్రోల్ల్స్ కి గురవుతున్న సెలెబ్రిటీలు

Ads

Ads :  సినిమా సెలెబ్రిటీలు ఫేమ్ ఉన్నప్పుడు యాడ్స్ చేస్తూ ఉంటారు. యాడ్స్ వల్ల కూడా బాగానే సంపాదిస్తారు. ఇప్పుడున్న చాలా మంది హీరోలు, హీరోయిన్లు యాడ్స్ చేస్తున్న వాళ్ళే. అయితే వాళ్ళు చేసే యాడ్స్ ని జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏ యాడ్ పడితే ఆ యాడ్ చేస్తే విమర్శల పాలవుతారు. వాళ్ళు ప్రమోట్ చేసే వస్తువు లేదా సంస్థ ప్రజలకి హాని కలిగించేది లేదా మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉంటే ఖచ్చితంగా విమర్శలపాలవుతారు సెలబ్రిటీలు. ఇటీవల వరుసగా చాలా మంది సెలబ్రిటీలు చేసిన యాడ్స్ వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు.

కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు పాన్ బహార్ యాడ్ చేశారు. అది పాన్ మషాలా అని, దాని వల్ల హెల్త్ పాడవుతుంది అని తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నారు ఆ యాడ్ అంటూ మహేష్ పై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ యాడ్ వల్ల మహేష్ ని బాగా ట్రోల్ చేశారు. ఆ యాడ్ నుంచి తప్పుకోమని కూడా చెప్పారు. ఆ తర్వాత రష్మిక ఇటీవల ఒక అండర్వేర్ కంపెనీని ప్రమోట్ చేసింది. రష్మిక చేసిన యాడ్ లో హీరో ఎక్సర్సైజ్ చేస్తుంటే అండర్వేర్ కనిపిస్తుంది. దీంతో రష్మిక అలాగే ఆ అండర్వేర్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ యాడ్ వల్ల రష్మికని దారుణంగా ట్రోల్ చేశారు. ఆడవాళ్లు అలా చూస్తారా? అసలు ఆ యాడ్ ఎలా ఒప్పుకున్నావు? డబ్బుల కోసం ఇలాంటి యాడ్ చేస్తావా అంటూ రష్మికని ట్రోల్ చేశారు.

Prabhas : ప్రభాస్ సిగ్గుపడతాడు.. కాని కుదిరినప్పుడల్లా డిన్నర్ కి పిలుస్తాడు

ఇటీవల అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యాసంస్థల్ని ప్రమోట్ చేస్తూ యాడ్ చేశాడు. ఆ సంస్థలపై నెగిటివిటి ఉండటం వల్ల నెటిజన్లు, ఆ సంస్థ పాత విద్యార్థులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారు. చదువు పేరుతో ఒత్తిడికి గురి చేసే అలంటి సంస్థలకి ఎలా యాడ్ చేస్తారు అంటూ అల్లు అర్జున్ ని ప్రశ్నించారు. తాజాగా హీరోయిన్ రెజీనాని కూడా విమర్శిస్తున్నారు. రెజీనా సిగ్నేచర్ అనే ఆల్కహాల్ ని ప్రమోట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలీదా? ప్రజలకి హాని కలిగించే వస్తువుని ఎలా ప్రమోట్ చేస్తావు అంటూ రెజీనాని ట్రోల్ చేస్తున్నారు.

Maheshbabu : ‘లవ్ స్టోరీ’తో మహేష్ బాబుకి లాభం

ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. సినిమా సెలబ్రిటీలని జనాలు అనుసరిస్తూ ఉంటారు. అలాంటి సెలబ్రిటీలు జనాలకి ఆదర్శంగా నిలవాల్సింది పోయి జనాలకి హాని కలిగించే వస్తువులని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ట్రోల్ల్స్ చూశాక అయినా సెలబ్రిటీలు యాడ్స్ ని జాగ్రత్తగా ఎంచుకుంటారని భావిస్తున్నారు.