Health Benefits of Cloves : ఆరోగ్యప్రయోజనాలు అందించే లవంగాలు…వీటిలోని ఔషదగుణాల గురించి తెలిస్తే !

కాలేయ కణాలు దెబ్బతినకుండా నిరోధించడంతోపాటు, షుగర్ తో బాధపడే వారిలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. జలుబు, దగ్గు లాంటి సమస్యలను పోగొట్టుకోవాలంటే రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని పీల్చుకుంటుంటే త్వరగా వాటి నుండి ఉపశమనం పొందవచ్చు.

Health Benefits of Cloves : ఆరోగ్యప్రయోజనాలు అందించే లవంగాలు…వీటిలోని ఔషదగుణాల గురించి తెలిస్తే !

cloves

Health Benefits of Cloves : ప్రకృతి ప్రసాదించే అనేక రకాల సహజ సిద్ధమైన ఔషదాలకు మన వంటిల్లు నెలవుగా చెప్పవచ్చు. పోపుల పెట్టెలో లభించే మెంతులు, జీలకర, లవంగాలు, యాలకులు, మిరియాలు, అల్లం , అవాలు ,చిన్న ఉల్లి, పెద్ద ఉల్లి వంటి అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులను తగ్గించటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఆయుర్వేద వైద్యంలో వీటిని విరివిగా ఉపయోగిస్తూ అనేక జబ్బులకు చికిత్స అందిస్తున్నారు.

READ ALSO : Diabetes : మధుమేహులు కాలేయం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

అలాంటి వాటిలో లవంగాలు ముఖ్యంగా చెప్పవచ్చు. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లవంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి. లవంగాల్లో విటమిన్ C, K, ఫైబర్ , మాంగనీస్, కాలరీలు, పిండిపదార్థాలు, పాస్ఫరస్, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. లంగాలను మసాల దినుసుగా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా సౌందర్య ఉత్పత్తుల తయారీలో లవంగాలతోపాటు, దాని నుండి తయారైన నూనెను ఉపయోగిస్తారు.

ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అందించే లవంగాలు ;

లవంగాల్లో అనేక ఔషధ గుణాలు ఉండటం వల్ల వీటిని క్రమం తప్పకుండా వాడితే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆహారం తీసుకున్న తరువాత అది సక్రమంగా జీర్ణం కావాలంటే నోట్లో రెండు లవంగాలు వేసుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటంతోపాటు, వికారం వంటివి తొలగిపోతాయి. లవంగాల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల చిగుళ్లు, నోటి సమస్యలను తొలగించుకోవచ్చు.

READ ALSO : Kidney Stone : కిడ్నీల్లో రాళ్ల సమస్యా? మొక్కజొన్న పొత్తులపై ఉండే పీచుతో!

సంతానోత్పత్తిని మెరుగుపరిచేందుకు లవంగాలు సహయపడతాయి. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి సంతానోత్పత్తి కి దోహదం చేస్తాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. లవంగాలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. గుండెకు హానికలిగించే కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో లవంగాలు తోడ్పడతాయి. అధిక రక్తపోటును నియంత్రించటంలో సహాయకారిగా చెప్పవచ్చు.

కాలేయ కణాలు దెబ్బతినకుండా నిరోధించడంతోపాటు, షుగర్ తో బాధపడే వారిలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. జలుబు, దగ్గు లాంటి సమస్యలను
పోగొట్టుకోవాలంటే రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని పీల్చుకుంటుంటే త్వరగా వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి నుండి ఉపశమనం కలిగించటంలో సైతం
లవంగాలు ఉపకరిస్తాయి.

ఎముకలు దృఢంగా మారేందుకు, నోటి నుండి వచ్చే దుర్వాసనను పోగొట్టేందుకు చాలా మంది ఈ లవంగాలను తీసుకోవచ్చు. లవంగాల నుండి తీసే యూజెనాల్ అనే నూనె నొప్పి,
వాపు, మంటల్ని తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

READ ALSO : Oral Hygiene : మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత తప్పనిసరా?

అయితే లవంగాలను మోతాదుకు మించి తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గర్భవతులు లవంగాలను ఎక్కువ మోతాదులో తీసుకోరాదు. అతిగా తీసుకుంటే మాత్రం లివర్, కిడ్నీతోపాటు, కంటి సమస్యలు తలెత్తుతాయి.