Oral Hygiene : మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత తప్పనిసరా?

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెదడులో కనిపించే న్యూరాన్‌లపై దాడి చేస్తుంది. దీని ఫలితంగా జ్ఞాపకశక్తి కోల్పోవడంతోపాటుగా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. సమస్య తీవ్రమైన సందర్భంలో మెదడు చీము ఏర్పడుతుంది. చీము మెదడుపై దాడి చేసి వివిధ సమస్యలను కలిగిస్తుంది. దంతాల నుండి బ్రెయిన్ కు ఇన్ఫెక్షన్ కలిగితే ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Oral Hygiene : మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత తప్పనిసరా?

Is oral hygiene necessary for a healthy brain?

Oral Hygiene : మానవ మెదడు అనేక శరీర విధులను నియంత్రిస్తుంది. మెదడు ఆరోగ్యం ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆలోచించడానికి, కదిలించడానికి, ఊపిరి పీల్చుకోవడానికి మరియు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి మెదడు అనుమతిస్తుంది. శరీరంలోని ప్రధాన విధులను నియంత్రించే సంక్లిష్టమైన అవయవంగా మెదడును చెప్పవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కారకాలతో సహా మెదడు గురించి ఇంకా అనే విషయాలపై పరిశోధకులు అధ్యయనాలు కొనసాగిస్తున్నారు. మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో నోటి ఆరోగ్యం కూడా ఒకటిని అధ్యయనాల్లో కనుగొన్నారు.

నోటి ఆరోగ్యం సరిగా లేని వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ బారిన పడుతున్నట్లు పలు పరిశోధనల్లో నిర్ధారణ అయింది. దీంతో నోటి ఆరోగ్యానికి మెదడు పనితీరుకు లింకున్నట్లు స్పష్టమైంది. దంతాలు మెదడుకు నేరుగా అనుసంధానించబడి ఉంటాయి. దంతాలు, చిగుళ్ళు, దవడ మరియు మరిన్నింటిని కలిపే కపాల నాడి వీటన్నింటిని అనుసంధానిస్తూ నరాలు ఉంటాయి. దంతాల ఇన్ఫెక్షన్ కు గురైతే క్రమేపి అది బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. దంతాల ఇన్ఫెక్షన్ రక్తప్రవాహానికి వ్యాపించినప్పుడు ఇది బ్యాక్టీరియాను నేరుగా మెదడుకు తీసుకువెళుతుంది.

ఈ సమయంలో, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెదడులో కనిపించే న్యూరాన్‌లపై దాడి చేస్తుంది. దీని ఫలితంగా జ్ఞాపకశక్తి కోల్పోవడంతోపాటుగా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. సమస్య తీవ్రమైన సందర్భంలో మెదడు చీము ఏర్పడుతుంది. చీము మెదడుపై దాడి చేసి వివిధ సమస్యలను కలిగిస్తుంది. దంతాల నుండి బ్రెయిన్ కు ఇన్ఫెక్షన్ కలిగితే ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో జ్వరం, నీరసం, తలనొప్పి, వికారం మరియు వాంతులు, మతిమరుపు , గందరగోళం, దృష్టి మార్పులు ఇంకా చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే దంతాలను రోజువారిగా శుభ్రపరుచుకోవాలి. లేని పక్షంలో దంతాలు, చిగుళ్లు ఇన్ ఫెక్షన్ చివరకు మెదడుకు చేరి తీవ్రపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

రోజుకి రెండు సార్లు నోటిని శుభ్రం చేసుకోండి. తిన్న వెంటనే నోటిని నీటితో పుక్కిలించండి. అలాగే రోజు ఎక్కువ సార్లు నీటిని తాగుతూ ఉండాలి. ఆల్కహాల్‌ను పరిమితం చేయడం, ధూమపానం మానేయడం, అధిక రక్తపోటును నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం మరియు తగినంత శారీరక శ్రమను పొందడం వంటివి మంచి మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. నోటి ఆరోగ్యం కారణంగా మెదడు ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొంటున్నారని భావిస్తే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించటం మంచిది.