Coronavirus : 30 శాతం కరోనా బాధితుల్లో ‘లాంగ్‌ కొవిడ్‌’ లక్షణాలు ఇవే.. జర జాగ్రత్త!

Coronavirus : కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Coronavirus : 30 శాతం కరోనా బాధితుల్లో ‘లాంగ్‌ కొవిడ్‌’ లక్షణాలు ఇవే.. జర జాగ్రత్త!

Coronavirus Us Study Finds 30% Covid Patients Develop 'long Covid'

Updated On : April 20, 2022 / 11:47 AM IST

Coronavirus : కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన వేయించుకున్నప్పటికీ ఒకసారి కరోనా సోకి వైరస్ నుంచి కోలుకున్నాక.. కోవిడ్ కు సంబంధించి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ బాధిస్తున్నాయి. దాదాపు కరోనా నుంచి కోలుకున్నవారిలో 30శాతం మంది లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు ఓ కొత్త అధ్యయనంలో తేలింది. వైరస్ నుంచి బయటపడినా బాధితుల శరీరంలోని వైరస్ సంబంధిత సూక్ష్మ వ్యాధి కణాల ప్రభావంతో లక్షణాలు అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చాలామంది కరోనా బాధితుల్లో కోలుకున్నాక తీవ్ర అలసటగా అనిపించడం, శ్వాససంబంధిత సమస్యలు, వాసనను గ్రహించలేకపోవడం వంటి దీర్ఘకాలిక లక్షణాలు ఉంటున్నాయని నిర్ధారించినట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ఏంజెల్స్‌(UCLA) పరిశోధకులు వెల్లడించారు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన బాధితుల్లో ఇదివరకే డయాబెటిస్‌, అధిక బాడీ మాస్‌ ఇండెక్స్‌(BMI) ఉంటే.. వారిలోనే ఎక్కువగా లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

Coronavirus Us Study Finds 30% Covid Patients Develop 'long Covid' (1)

Coronavirus Us Study Finds 30% Covid Patients Develop ‘long Covid’ 

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ర్టాలకు ముందస్తు జాగ్రత్తలను సూచించింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయాలని సూచించింది. అంతేకాదు వైరస్ వ్యాప్తి కాకుండా ముందస్తు చర్యలను వెంటనే చేపట్టాలని రాష్ట ప్రభుత్వాలను కోరింది. ఇప్పటికే కరోనా కేసులకు సంబంధించి ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, హర్యానా, మిజోరం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కరోనా బాధితులను గుర్తించేందుకు టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ నిబంధనల అమలు చేయడం వంటి ఐదంచెల సూత్రాలను పాటించాలని రాష్ట్రప్రభుత్వాలకు రాజేశ్ భూషణ్ సూచనలు చేశారు.

Read Also : Delhi Covid : పెరుగుతున్న కోవిడ్ కేసులు- నేడు ఢిల్లీ ప్రభుత్వం కీలక సమావేశం