Estrogen : మహిళల్లో సమస్యలకు దారితీసే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుదల!

తాజా ఆహారాన్ని తీసుకోవాలి. సోయా బీన్స్ తోపాటు, సోయా ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర వాడకాన్ని తగ్గించండి. తృణధాన్యాలతో కూడిన ఆహారాలను తీసుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

Estrogen : మహిళల్లో సమస్యలకు దారితీసే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుదల!

Estrogen

Estrogen : మహిళల్లో వయస్సు పెరిగే కొద్ది శరీరంలో అనేక మార్పులు వస్తాయి. చాలా మంది మహిళలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎదుర్కొనే సమస్య మెనోపాజ్ . ఈసమస్యలో పీరియడ్స్ ఆగిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. ఈ హార్మోన్స్ తగ్గడం వల్ల మహిళలు అనేక రకాల సమస్యలకు లోనుకావాల్సి వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్‌ తగ్గితే, శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. శరీరం కాస్త వేడిగా మారే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఆందోళనకు గురవుతారు. కోపం పెరుగుతుంది. ఒత్తిడివంటి సమస్యలు తీవ్రతరమౌతాయి.

చర్మం పొడిబారుతుంది. సహజసిద్ధ ఆమ్లాల తయారీ తగ్గి, చర్మం నిర్జీవంగా తయారవుతుంది. మైగ్రెయిన్ సమస్య పెరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్‌ లోపం కారణంగా పిరియడ్స్ రాకుండా నిలిచిపోతాయి. అలాంటి సందర్భంలో ఈస్ట్రోజన్ హార్మోన్‌ లోపం అనే అనుమానించాలి. ఈ హార్మోన్ తగ్గితే నెలసరి స్రావం తక్కువగా కనిపించడం లేదా పూర్తిగా కనిపించకుండా పోవడం జరుగుతుంది. అండాశయాలు పూర్తిగా తగ్గి గర్భాధారణ సమస్యలు వస్తుంటాయి. మెదడులోని హైపోథలామస్‌‌‌‌‌ హార్మోన్ పనితీరు ఈస్టోజన్ హార్మోన్ కారణంగా తగ్గుతుంది. దీని వల్ల రాత్రి సమయంలో చెమటలు పోయటం, వేడి ఆవిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధికంగా బరువు పెరుగుతుంటారు. పొట్ట చుట్టూ కొవ్వులు పేరుకుపోతాయి. యోనీ పొడిబారిపోయి సెక్స్ సమయంలో నొప్పిగా అనిపిస్తుంది. రాత్రిసమయంలో సరిగా నిద్రపట్టకపోవటం, కళ్లు పొడిబారిపోతుంటాయి.

హార్మోన్ల స్థాయిలలో అసమతుల్యతతో కలిగే లక్షణాలను గమనించన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుదల గమనించిన వెంటనే జీవనశైలిలో మార్పులు చేసుకోవటం వల్ల ఎండోక్రైన్ వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి సాధారణ స్ధాయికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దూమపానం అలవాటు ఉంటే దానిని మానుకోవటం మంచిది. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. సోయా బీన్స్ తోపాటు, సోయా ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర వాడకాన్ని తగ్గించండి. తృణధాన్యాలతో కూడిన ఆహారాలను తీసుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. వైద్యుల సూచనలు సలహాలు పొందకుండా సొంతగా ఈ స్ట్రోజన్ హార్మోన్ పెంచుకునే ప్రయత్నాలు చేయటం ఏమాత్రం మంచిది కాదని గమనించండి.