ఆన్‌లైన్ క్లాసులా.. ఈ కళ్లద్దాలే వాడాలంటోన్న కంటి డాక్టర్లు

ఆన్‌లైన్ క్లాసులా.. ఈ కళ్లద్దాలే వాడాలంటోన్న కంటి డాక్టర్లు

ప్రస్తుతం వర్చువల్ లెర్నింగ్.. ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలో కంటి డాక్టర్లు బ్లూ లైటింగ్‌ను బ్లాక్ చేసే కళ్లద్దాలు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. ఈ అద్దాలు స్పెషల్ టెక్నాలజీ ఉపయోగిస్తుండటంతో కళ్లకు రక్షణగా ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్లు, ఫోన్లు, టీవీల నుంచి వచ్చే బ్లూ లైట్ ను అడ్డుకుంటుంది.



ప్రీమియర్ ఐ సెంటర్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డా. స్టీవ్ బుస్సా ఎక్కువ సేపు ఎల్ఈడీ స్క్రీన్లు చూడటం వల్ల కళ్లకు నీరసంగా.. ఇబ్బందికరంగా ఉంటుందని ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లకే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. బ్లూ లైట్ బ్లాకింగ్ అద్దాలు ఉంటేనే వారంతా ప్రో యాక్టివ్ గా ఉంటున్నారని తెలిసింది.
https://10tv.in/lockdown-brings-spotlight-on-online-gaming-addiction/
‘నేను ప్రతిసారి ఇలాంటివి ఉదాహరణగా చెప్పడానికి సన్ స్క్రీన్ నే వాడతాం. కాసేపు ఎండలో నిల్చోవడానికి వెళ్లాలి. ఇది నిజానికి శరీరానికి చాలా అవసరం. కానీ, మనమంతా పిల్లలతో సహా.. ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్లు, టీవీలపైనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ‘

డా. బుస్సా పిల్లలు, పేరెంట్స్, టీచర్లు అందరూ కంటిడాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఆ తర్వాతే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసులు వాడటం మొదలుపెట్టాలి.