గడ్డం బ్లేడ్ కాంట్రవర్సీ : ఆడోళ్లను వేధిస్తేనే మగతనమా?

  • Edited By: veegamteam , January 29, 2019 / 12:37 PM IST
గడ్డం బ్లేడ్ కాంట్రవర్సీ : ఆడోళ్లను వేధిస్తేనే మగతనమా?

జిల్లెట్.. పరిచయం అక్కర్లేని పేరు. షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ సంస్థ. జిల్లెట్ గురించి తెలియనివారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ బ్రాండ్. షేవింగ్ ఉత్పత్తుల తయారీలో దిగ్గజమైన జిల్లెట్ సంస్థ రీసెంట్‌గా ఒక యాడ్ రూపొందించింది. మంచి క్రియేటివిటీతో అడ్వర్‌టైజ్‌మెంట్ డిజైన్ చేశారు. సోషల్ మీడియాలో ఈ యాడ్ వైరల్ అయ్యింది. కోట్లమంది దీన్ని వీక్షించారు. అయితే ఈ యాడ్ పెద్ద కాంట్రవర్సీనే కూడా క్రియేట్ చేసింది.

 

సోషల్ మీడియాలో జిల్లెట్ యాడ్ దుమారం రేపుతోంది. ఇందులో కొన్ని సీన్లు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మరీ ముఖ్యంగా మహిళలకు. పురుషాధిక్యాన్ని ప్రదర్శించేందుకు మహిళలను తక్కువ చేసి చూపారని నెటిజన్లు మండిపడుతున్నారు. స్త్రీవాదాన్ని అవమానించారని సీరియస్ అవుతున్నారు. ఆడోళ్లను వేధిస్తేనే మగతనమా? అని విరుచుకుపడుతున్నారు. మీ సేల్స్ పెంచుకోవడానికి ఇంతకు దిగజారిపోతారా? అని ప్రశ్నిస్తున్నారు. అసలే మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా మీ టూ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యాడ్‌లు తీసి సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని నిలదీస్తున్నారు. ఈ యాడ్‌కు ఇప్పటికే కోట్లాది వ్యూస్ రాగా… ఎక్కువగా డిస్ లైక్ చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.