Grapes : ఆరోగ్యానికి, సౌందర్యానికి….ద్రాక్ష ఎంతో మేలు

చర్మ సంరక్షణకు వీటిని స్క్రబ్ ,మాయిశ్ఛరైజర్ తయారీలో ఉపయోగిస్తారు. తాజా ద్రాక్షలను గుజ్జుగా మార్చి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Grapes : ఆరోగ్యానికి, సౌందర్యానికి….ద్రాక్ష ఎంతో మేలు

Grapes

Grapes : ద్రాక్ష రుచికరమైన పండ్లలో ఒకటి…దీని పేరు చెప్తేనే తినాలనిపిస్తుంది. ఆరోగ్యానికి సౌందర్యానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. ద్రాక్షలో టన్నీస్,పాలిఫినాల్స్ క్యాన్సర్ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వును తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా గుండె పనితీరు మెరుగకు దోహదపడతాయి. ఇందులో ఉండే నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి.

నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. ఊబకాయంతో బాధపడుతున్నవారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకోవాలి. ద్రాక్షను తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మానసిక సమస్యలతోపాటు, మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. నల్ల ద్రాక్షలో రెస్వెరాటల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడం ద్వారా శరీరంలోని చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష పండ్లలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలో కొల్లాజిన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది. వీటిల్లోని పైటో కెమికల్స్ కణాల క్షీణతను తగ్గించటంతోపాటు శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపిస్తాయి. జీవం కోల్పోయిన జుట్టుకు దాక్ష పండ్లలోని గింజలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. అందులోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణ అందించి రాలే జుట్టు సమస్యను నివారిస్తాయి. అంతేకాకుండా మంచి నిగారింపు సంతరించుకునేలా చేస్తాయి.

చర్మ సంరక్షణకు వీటిని స్క్రబ్ ,మాయిశ్ఛరైజర్ తయారీలో ఉపయోగిస్తారు. తాజా ద్రాక్షలను గుజ్జుగా మార్చి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష ఏదైనా సరే సౌందర్య పోషణలో కీలక పాత్ర పోషిస్తాయని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. చర్మ సంరక్షణలో వీటిని విభిన్న రకాలుగా వినియోగిస్తారు.

ఎండల్లో ఎక్కవగా తిరిగే వారు ఒక కప్పు తెల్లద్రాక్ష తీసుకుని వాటిని మెత్తగా చేసి ఈ గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం తేటాగా ఉంటుంది. గింజల్లేని పెద్ద సైజు ద్రాక్షాలను తీసుకుని వాటిని సగానికి కోసం ముఖానికి సున్నితంగా రుద్దుకోవాలి. కళ్ల క్రింద, పెదవుల చివర ముడతలు వచ్చే ప్రదేశాల్లో రుద్దటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వయస్సు పెరగటం వల్చే వచ్చే ముడతలు నిరోధించేందుకు ఉపయోగకారిగా పనిచేస్తుంది.

రెండు చెంచాల ద్రాక్ష రసానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పావు గంట తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల ముఖం మృధువుగా తయారవుతుంది. ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష రసంలో గుడ్డులోని పచ్చసొన బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. చర్మంపై ఉండే జిడ్డు కాస్త తొలగిపోతుంది.