Popcorn : పాప్ కార్న్ తినే అలవాటుందా? ప్రయోజనాలు తెలిస్తే!

పాప్‌కార్న్‌లోని ఫైబర్ కంటెంట్ ఆకలి హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Popcorn : పాప్ కార్న్ తినే అలవాటుందా? ప్రయోజనాలు తెలిస్తే!

Popcorn

Popcorn : పాప్‌కార్న్ అనేది ఒక చిరుతిండిగా అంతా భావిస్తుంటారు. సరదాగా టైం పాస్ కోసం థియేటర్లలో సినిమాలు చూసే సమయంలో, స్నేహితులతో కలసి పిచ్చాపాటి మాటల సందర్భంలోనో పాప్ కార్న్ ను సరదాగా తీసుకుంటుంటారు. మొక్కజొన్నతో తయారైన పాప్‌కార్న్ ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం. మొక్కజొన్నను ఆహారంగా తీసుకోవటం ప్రాచీన కాలం నుండి వస్తుంది. మొక్కజొన్న విత్తనాలను కొద్దిపాటి నూనెతో వేయించటం వల్ల పాప్ కార్న్ తయారవుతుంది. చాలా మంది దానికి రుచికోసం కొంచెం ఉప్పు, వెన్న వంటి వాటిని వేసుకుంటుంటారు. అయిలే పాప్ కార్న్ కు ఉప్పు,వెన్న వంటి వాటిని కలిపి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పాప్‌కార్న్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్ మరియు మెగ్నీషియం ఉన్నాయి. పాప్‌కార్న్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పాప్‌కార్న్‌లో పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిల విడుదల, నిర్వహణను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించటం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. డయాబెటిస్‌ను నివారించడానికి పాప్‌కార్న్ తీసుకోవడం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. పాప్‌కార్న్ల లో అధిక ఫైబర్‌ ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అధిక ఫైబర్ ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైనది. డయాబెటిస్‌తో బాధపడే వారు పాప్‌కార్న్‌ను సురక్షితంగా తీసుకోవచ్చు.

పాప్‌కార్న్ లో ఎండోస్పెర్మ్, జెర్మ్ వంటివి జీర్ణక్రియకు దోహదపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పాప్‌కార్న్‌లో ఫైబర్ ఉంటుంది, ఇది రక్త నాళాలు, ధమనుల గోడల నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. తద్వారా మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోకులు వంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. పాప్‌కార్న్‌లో పెద్ద మొత్తంలో పాలీ-ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లలో ఇది ఒకటి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తొలగించటానికి దోహదపడతాయి.

పాప్‌కార్న్‌లోని ఫైబర్ కంటెంట్ ఆకలి హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ముడుతలు, వయస్సు మచ్చలు, అంధత్వం, కండరాల బలహీనత ,జుట్టు రాలడం వంటి వయస్సు సంబంధిత లక్షణాలను నిరోధించేందుకు పాప్‌కార్న్ సహాయపడుతుంది. పాప్‌కార్న్‌లో గణనీయమైన స్థాయిలో మాంగనీస్ ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మాణానికి సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్,ఆస్టియో ఆర్థరైటిస్ నుండి రక్షిస్తుంది.

యుఎస్‌డిఎ ప్రకారం, 28 గ్రాముల పాప్‌కార్న్‌లో 0.9 మి.గ్రా ఇనుము ఉంటుంది. పురుషులకు ప్రతిరోజూ వారి ఆహారంలో 8 మి.గ్రా ఐరన్ మాత్రమే అవసరమవుతుంది. యుక్త వయస్సు మహిళలకు రోజుకు 18 మి.గ్రా ఐరన్ అవసరం. కాబట్టి పాప్‌కార్న్ తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్ ను పొందవచ్చు.