Immunity : ఇమ్యూనిటీని పెంచే హెర్బల్ టీ

ఈ జీరా టీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో లభించే వస్తువుల సహాయంతో దీనిని పెట్టుకోవచ్చు. ఈ టీని తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్ధాలను పరిశీలిస్తే 2కప్పుల నీళ్ళు, కల్లు ఉప్పు తగినంత, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, లవంగం ఒకటి, ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, అరటీస్పూన్ సోంపు గింజలు తీసుకోవాలి.

Immunity : ఇమ్యూనిటీని పెంచే హెర్బల్ టీ

Herbal Tea

Immunity : వ్యాధులనేవి మనుషులకు నిరంతరం ముప్పగా పరిణమించాయి. ఏసమయంలో ఎలాంటి వ్యాధికి గురికావాల్సి వస్తుందోనన్నభయంతో  బ్రతకాల్సి వస్తుంది. మనిషి వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం నిరంతరం శరీరంలో ఇమ్యునిటీ వ్యవస్ధను బలేపేతంగా తయారు చేసుకుంటూ ఉండాలి. రోగ నిరోధక వ్యవస్ధ కలిగి ఉంటే వ్యాధి వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కో కలిగే ఆరోగ్యవ్యవస్ధ మన శరీరంలో పనిచేస్తుంది.

ఇందుకోసం పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. అదే సమయంలో రోగనిరోధక వ్యవస్ధ చైతన్యవంతం చేయటంలో కొన్ని హెర్బల్ టీలు ఎంతో ఉపయోగపడతాయి. హెర్బల్ టీని తాగటం వల్ల రోగనిరోధక వ్యవస్ధను పెంచుకోవచ్చు. రోగ నిరోధక వ్యవస్ధను పెపొందించే హెర్బల్ టీలలో జీరా టీ కూడా ఒకటినే చెప్పాలి.

ఈ జీరా టీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో లభించే వస్తువుల సహాయంతో దీనిని పెట్టుకోవచ్చు. ఈ టీని తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్ధాలను పరిశీలిస్తే 2కప్పుల నీళ్ళు, కల్లు ఉప్పు తగినంత, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, లవంగం ఒకటి, ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, అరటీస్పూన్ సోంపు గింజలు తీసుకోవాలి.

ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనియ్యాలి. ముందుగా తీసుకున్న జీలకర్ర,సోంపు,పుసుపు,వాము,కల్లు ఉప్పు తగినంత,దాల్చిన చెక్కపొడి మరిగే నీళ్లలో వేసి మూత పెట్టి 5 నిముషాలపాటు మరగనియ్యాలి. తర్వాత వేడి వేడిగా తాగాలి. హెర్బల్‌ టీలోని వాము, జీలకర్ర, సోంపు గింజలు మీ రోగనిరోధకతను పెంచడమేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్థాయి. తాపాన్ని తగ్గించి శరీరంలోని ఇన్ ఫెక్షన్ల నుండి ఈ హెర్బల్ టీ రక్షణగా పనిచేస్తుంది. జలుబు,దగ్గువంటి వాటికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఈ టీ తీసుకోవటం ద్వారా కొన్ని రకాల వ్యాధులు వచ్చినా వాటి నుండి రక్షణ పొందవచ్చు.