Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు ఏడు మార్గాలు ఇవే!

ప్రతిరోజు మూడు పూటలా కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. తినేఆహారం కూడా పోషకాలతో కూడి ఉన్నదై ఉండాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు భోజనం చేయటంతోపాటు , డ్రై ఫ్రూట్స్, పండ్లు , కూరగాయలతో కూడిన స్నాక్స్ తీసుకోవాలి.

Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు ఏడు మార్గాలు ఇవే!

Stay Healthy

Stay Healthy : లక్షల కోట్ల ఆస్తులున్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరావు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమైనది మాత్రం ఆహారమే. మనం తీసుకునే ఆహారంలో సరైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని సులభంగానే సొంతం చేసుకోవచ్చు. దీనికి గాను నిపుణులు ఏడు మార్గాలను సూచిస్తున్నారు. వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఆరోగ్యం కోసం ఏడు మార్గాలు ;

1. ప్రతిరోజు మూడు పూటలా కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. తినేఆహారం కూడా పోషకాలతో కూడి ఉన్నదై ఉండాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు భోజనం చేయటంతోపాటు , డ్రై ఫ్రూట్స్, పండ్లు , కూరగాయలతో కూడిన స్నాక్స్ తీసుకోవాలి.

2. మీ ఆహారంలో రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇందులో రెండు నుండి నాలుగు తాజా పండ్లు తీసుకోవాలి. తృణధాన్యాలతో పాటు పెరుగు, ఫ్రూట్ సలాడ్ లను స్నాక్స్ గా తీసుకోవచ్చు.

3. పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూడాలి. దీని వల్ల రోజు మొత్తం శక్తివంతంగా ఉండవచ్చు. పీచు పదార్ధాలు మధుమేహం వంటి దుష్పరిణామాలు రాకుండా చూస్తుంది. నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

4. కొవ్వు చేరని ఆహార పదార్ధాలు తీనండి. 100 గ్రాముల పాల ఉత్పత్తుల్లో మూడు గ్రాముల కొవ్వు ఉంటుంది. అందువల్ల కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులతోపాటు, స్కిన్ లెస్ చికెన్ వంటివి తీసుకోండి.

5. మాంసాహారులైయితే వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినటం మంచిది. శాఖాహారులు చిరుధాన్యాలు అధికంగా తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది.

6. మీరు తినే ఆహారంలో ఉప్పు, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోండి. సోడియం రోజుకు 2,300 మిల్లీ గ్రాముల అంటే ఓ టీ స్పూన్ కు మించకుండా ఉండేలా జాగ్రత్త పడండి. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ వంటి పదార్ధాలను తినపోవటం మంచిది.

7. ప్రతిరోజు ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించండి. దీని వల్ల రోజు మొత్తం చురుకుగా ఉండటంతోపాటు, ఆరోగ్యంగా ఉండవచ్చు.