Dust Allergy : చలికాలంలో దుమ్ము కారణంగా ఎదురయ్యే డస్ట్ అలెర్జీ సమస్యలకు ఇంటి చిట్కాలే పరిష్కార మార్గాలు!

తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నియమ నిబంధనల ప్రకారం తులసిని పూజిస్తారు. ఇందులో ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది.

Dust Allergy : చలికాలంలో దుమ్ము కారణంగా ఎదురయ్యే డస్ట్ అలెర్జీ సమస్యలకు ఇంటి చిట్కాలే పరిష్కార మార్గాలు!

Home Remedies for Dust Allergy Problems in Winters!

Dust Allergy : వాతావరణంలో మార్పు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాతావరణానికి అనుగుణంగా ప్రత్యేకమైన అలర్జీలు ఉంటాయి. వేసవిలో గాలిలోని పుప్పొడితో అలర్జీలు కలిగితే, వర్షాకాలంలో తడి వాతావరణంలో వృద్ధి చెందే ఫంగస్, బ్యాక్టీరియాలతో అలర్జీలు కలుగుతాయి. శీతాకాలంలో దుమ్ము, పొగమంచు అలర్జీల ముప్పు పొంచి ఉంటుంది.

చలికాలంలో దుమ్ము కారణంగా డస్ట్ అలెర్జీని కలుగజేస్తాయి. దీంతో దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో నీరు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. డస్ట్ అలర్జీని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మన ఇంట్లో లభించే సుగంధ దినుసులతో డస్ట్ అలర్జీలకు చెక్ పెట్టవచ్చు.

చలికాలంలో డస్ట్ ఎలర్జీలకు పరిష్కార మార్గాలు ;

పసుపు పాలు ; అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేసే ఒక శక్తివంతమైనది పసుపు. వాతావరణ చికాకులు, దగ్గు, నొప్పులను తగ్గిస్తుంది. రాత్రిపూట నిద్రవేళకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల డస్ట్ అలర్జీ నివారణకు సహాయపడుతుంది. ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది.

తులసి: తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నియమ నిబంధనల ప్రకారం తులసిని పూజిస్తారు. ఇందులో ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. తులసిని తీసుకోవడం వల్ల డస్ట్ అలర్జీని నయం చేస్తుంది. తులసిలో బయోయాక్టివ్, యాంటీమైక్రోబయల్ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. తులసి డస్ట్ అలెర్జీలతో సహా అనేక శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నల్లజీలకర్ర ఆయిల్ ; నల్ల జీలకర్ర లేదా కలోంజీ అనేది శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ , వాపును అడ్డుకుంటుంది. నల్ల జీలకర్ర నూనె అలెర్జీలకు చక్కని మూలికా ఔషధం. ఈ నూనెను ముక్కు, గొంతుపై రోజుకు రెండుసార్లు పూయడం , మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలర్జీలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

యోగాసనాలు: క్రమం తప్పకుండా యోగాసనాలు చేయటం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. ఇందుకుగాను అర్ధచంద్రాసన, పవనముక్తాసన, వృక్షాసన, సేతుబంధాసన వంటి యోగా వ్యాయామాలు చేయవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్‌తోనైనా పోరాడే శక్తిని మనకు ఈ యోగాసనాలు అందిస్తాయి.

పుదీనా: పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. పుదీనా తీసుకోవడం వల్ల డస్ట్ అలర్జీల బారి నుండి రక్షిస్తుంది.

కలబంద జ్యూస్ : కలబంద జ్యూస్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి డస్ట్ అలర్జీల నుండి ఉపశమనాన్నికలిగిస్తాయి. కలబంద రసం చేయడానికి, మీకు అలోవెరా జెల్, నీరు, నిమ్మరసం అవసరం. ఇది డస్ట్ అలర్జీ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.