Calcium Deficiency : మహిళల్లో కాల్షియం లోపం నివారించటం ఎలాగంటే?

మధ్య వయస్సు మహిళల్లో ఎముకలు పెళుసుగా ఉంటాయి. ఇలాంటి వారికి జింక్ చాలా అవసరం. మాంసాహారులైతే జింక్ సమృద్ధిగా లభించే గొర్రెమాంసం తినవచ్చు.

Calcium Deficiency : మహిళల్లో కాల్షియం లోపం నివారించటం ఎలాగంటే?

Calcium

Calcium Deficiency : చాలా మంది మహిళల్లో కాల్షియం లోపం ప్రధానంగా కనిపిస్తున్న సమస్యల్లో ఒకటి. శరీరానికి అవసరమైన వాటిని ఆహారంలో భాగం చేసుకోకుండా చాలా మంది అనవసరమైన ఫాస్ట్ ఫుడ్స్ ను తీసుకుంటూ శరీరంలో పోషకాల లోపం తలెత్తాలే చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కాల్షియం లోపం ప్రధానంగా కనిపిస్తుంది. తగినంత కాల్షియం ఉంటేనే ఎముకులు పఠిష్టంగా ఉంటాయి. సప్లిమెంటరీ మందుల ద్వారా కాకుండా తినే ఆహార పదార్ధాల ద్వారా సమకూర్చోవటం మంచిది. పౌష్టికాహారాన్ని తీసుకోవటం ద్వారా ఎముకలను పఠిష్టంగా ఉంచుకోవచ్చు. ఎముకలకు మేలు చేసే కాల్షియం, జింక్ లు ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి.

మధ్య వయస్సు మహిళల్లో ఎముకలు పెళుసుగా ఉంటాయి. ఇలాంటి వారికి జింక్ చాలా అవసరం. మాంసాహారులైతే జింక్ సమృద్ధిగా లభించే గొర్రెమాంసం తినవచ్చు. ఇక శాఖాహారులు ఆకు కూరలు, తమలపాకులు వంటి వాటిని తీసుకోవచ్చు. తోటకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది శీరంలోని ఎముకలకు అవసరమైన కాల్షియం ను సరఫరా చేయటంలో తోడ్పడుతుంది. అలాగే ఎముకలలోకి ఖనిజ లవణాలు చేరడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. విటమిన్ కె అస్ట్రియోపోరోసిస్ వ్యాధి ఉన్నవారిలో ఎముకలలో ఖనిజ లవణాల ప్రమాదాలు పెరగటానికి దోహదం చేయడమేగాక ఎముకలు చిట్లిపోవటం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.

ఆహారపదార్ధాలలలో ఉప్పును తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్రం ద్వారా కాల్షియం బైటకు పోతుంది. అందుకే ఉప్పును తక్కువగా తీసుకోవటం మంచిది. తోటకూర, బచ్చలి, పొన్నగంటి కూర, కొత్తిమీర, లాంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవటం వల్ల కాల్సియం తగినంత శరీరానికి అంది ఎముకలు దృడంగా మారతాయి.