మీరు 6 అడుగులకన్నా ఎత్తుంటే, కరోనా వచ్చే అవకాశాలు రెండింతలు

10TV Telugu News

మీ హైట్ ఎంత? ఎంత ఎత్తు ఉంటారు. ఎత్తు ఎక్కువగా ఉన్నా కరోనా సోకుతుంది జాగ్రత్త.. అంతేకాదు.. అధిక బరువు ఉన్నా కూడా కరోనా వైరస్ వదిలిపెట్టదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పొట్టిగా ఉన్నవాళ్ల కంటే ఎత్తు ఎక్కువగా ఉన్నవాళ్లకు కరోనా ముప్పు పొంచి ఉందని అంటున్నారు.


ఎత్తుగా ఉండటం వల్ల కోవిడ్ -19 సోకే అవకాశం రెండింతలు ఎక్కువగా అవుతుందని నిపుణులు తెలిపారు. యుకె, నార్వే, యుఎస్ పరిశోధకులు కరోనా వ్యాప్తిపై అనేక పరిశోధనలు చేశారు. ప్రారంభ ఫలితాల్లో 2,000 మంది వ్యక్తుల సర్వే నుంచి వైరస్ గాలి ద్వారా వ్యాపించే చాలా అవకాశం ఉందని సూచించారు. పొడవైన వ్యక్తులు రెండు రెట్లు ప్రమాదంలో ఉన్నారు. నోటి బిందువుల ద్వారా కూడా వ్యాపిస్తుందని సంగతి తెలిసిందే.

గాలిలో వైరస్ వ్యాపిస్తోంది జాగ్రత్త :
ఏరోసోల్స్ తక్కువ వెంటిలేషన్ ఉండే ప్రదేశాలలో ఉండిపోతాయి. వాయు ప్రవాహాల ద్వారా వ్యాపిస్తాయి. అయినప్పటికీ, నోటి బిందువులు ఏరోసోల్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. సాపేక్షంగా తక్కువ దూరం ప్రయాణించి గాలి నుంచి త్వరగా పడిపోతాయని భావిస్తారు.


ఏరోసోల్ వ్యాప్తిపై అందరిని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత లక్షణాలు, పరిస్థితులు, పని పరిస్థితుల ప్రభావాలను కూడా ఈ సర్వే విశ్లేషిస్తుంది. షేర్డ్ కిచెన్ లేదా వసతిని ఉపయోగించడం ముఖ్యమైన అంశం… ప్రత్యేకించి యుఎస్‌లో అసమానత 3.5 రెట్లు ఎక్కువ, యుకెలో 1.7 రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. యుకెలో ఉన్న వారితో పోలిస్తే.. ఈ వ్యాధి వచ్చే అవకాశం కొద్దిగా తక్కువగా కనిపిస్తోంది.

మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే :
మాంచెస్టర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఇవాన్ కొంటోపాంటెలిస్ ప్రకారం.. ఎత్తు ఎక్కువగా ఉన్నా కూడా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని ఈ సర్వే ఫలితాల్లో తేలింది. సామాజిక దూరం ముఖ్యమైనదిగా చెబుతున్నారు.


నోటి బిందువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. మాస్క్ ధరిస్తే పెద్దగా ప్రభావం ఉండదు. అంతర్గత ప్రదేశాలలో గాలిని ఎప్పటికప్పుడూ ప్యూర్ చేస్తుండాలని సూచిస్తున్నారు.

10TV Telugu News