60లోనూ 20గా ఉండాలనుకుంటే…ఇలా చేసి చూడండి

మన దేహంలోని అవయవాలన్నింటిని సక్రమంగా ఎక్కవకాలం పనిచేసేలా చూసుకోవాలి. ఇందుకోసం మంచి కొవ్వులను శరీరానికి అందించాలి. దేహానికి హానికరమైన జంతు సంబంధిత కొవ్వులకు దూరంగా ఉండాలి. బాదం, అవక

60లోనూ 20గా ఉండాలనుకుంటే…ఇలా చేసి చూడండి

Young Age

వయస్సు పెరిగే కొద్దీ మనుషుల్లో వృద్ధాప్య చాయలు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వయస్సు కనిపించకుండా జుట్టుకు రంగులద్దుతూ ఏదో కవర్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఆలా చేయటం ద్వారా ఏదో కొంతమేర మన మనస్సును తృప్తి పరుచుకోగలం. వయస్సు పైబడుతున్న కొద్దీ చాలా మంది తామ వయస్సు తగ్గితే బాగుండు అనుకోవటం సహజమే. అయితే కొన్ని ఆహార నియమాలు, అలవాట్ల ద్వారా వయస్సు పెరిగినప్పటికీ యువకుల్లా ఉత్సహంగానే ఉండవచ్చని వైద్యనిపుణులు అంటున్నారు.

జన్యు సంబంధమైన కారణాలతోనే మనిషిలో వృద్ధాప్య లక్షణాలు బయటపడుతుంటాయి. ఇది వయస్సు పైబడే ఎవరిలోనైనా కనిపిస్తాయి. అయితే కొంతమందిలో మాత్రం ఆహారంలో లోపాలు, హార్మోన్లలో వచ్చే లోపాలు, వ్యాధుల సంక్రమణ ద్వారా వృద్ధాప్య ఛాయలు బయటపడుతుంటాయి. అలాంటి వాటిని తగ్గించుకోవటం అన్నది మనచేతుల్లోనే ఉంటుంది. ఇందుకోసం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తే సరిపోతుంది. మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏదిపడితే అది తినకుండా శరీరానికి మంచి పోషకాలను సమకూర్చిపెట్టే ఆహారపదార్ధాలను తినటం మంచిది. కారాలు, మసాలాలు, ఉప్పు ఎక్కువ ఉండే పదార్ధాలను తగ్గించుకోవటం ఉత్తమం. మంచి ఆహార నియమాలు పాటిస్తే ఎక్కవకాలం యవ్వనంగా ఉండవచ్చు.

ఎముకలను పటిష్టపరుచుకునేందుకు, రక్త నాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు , కొలెస్ట్రాల్ తగ్గేలా చూసుకోవటం మంచిది. ఇందుకోసం ఆకుకూరలతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరల్లో ఆరోగ్యంగా ఉంచగలిగిన విటమిన్లు, ఖనిజలవణాలు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, చురుకుగా ఉండేలా చేస్తాయి. మన దేహంలోని అవయవాలన్నింటిని సక్రమంగా ఎక్కవకాలం పనిచేసేలా చూసుకోవాలి. ఇందుకోసం మంచి కొవ్వులను శరీరానికి అందించాలి. దేహానికి హానికరమైన జంతు సంబంధిత కొవ్వులకు దూరంగా ఉండాలి. బాదం, అవకాడో లాంటి నట్స్ ను తీసుకోవాలి. వీటి నుండి లభించే కొవ్వులు జీవక్రియల్లో పాలు పంచుకుని మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.

మనిషిలో వృద్ధాప్య ఛాయలు తొలగించేందుకు నిద్ర కూడా బాగా ఉపకరిస్తుంది. నీర్ణీత సమయంలో ఆరోగ్యకరమైన నిద్ర కూడా ఎంతో మేలు చేస్తుంది. కనీసం రోజులో 7 నుండి 8గంటల పాటు నిద్రపోవటం మంచిది. మన ఆలోచనలు కూడా మన వయస్సుపై ప్రభావం చూపుతాయి. నిత్యం ఏదో ఒక ఆలోచనలతో మెదడును ఒత్తిళ్లకు గురిచేసే వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్పుడు ప్రశాంతం ఉండాలి. టెక్షన్లకు దూరంగా ఉండటం మంచిది.

ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉండటానికి పెరుగు, మజ్జిగ, ఇడ్లీ,దోసె వంటి ప్రోబయాటిక్ ఫుడ్ ఎంతగానో దోహదపడతాయి. ఇవి జీర్ణవ్యవస్ధ బాగా నిర్వాహణకు ఉపయోగపడతాయి. అలాంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. సూపర్ ఫుడ్ గా చెప్పబడే దానిమ్మ వంటి పండ్లను తీసుకోవాలి. చక్కెర పాళ్ళు తక్కువగా ఉండే జామ, బొప్పాయి, నేరేడు వంటి పండ్లు తీసుకోవటం వల్ల కూడా యవ్వనం చాలాకాలం నిలకడగా ఉంటుంది. చక్కెర స్ధాయిలు అధికంగా ఉండే మామిడి, సపోటా వంటి పండ్లను అప్పుడప్పుడు తీసుకోవటం మంచిది.

ఎముకల ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి అవసరమైన డి విటమిన్ శరీరానికి అందేలా చూసుకోవాలి. సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ ను పొంద వచ్చు. అహ్లాదకరమైన వాతావరణంలో గడపటం, స్వచ్ఛమైన గాలిపీల్చటం వంటి వాటి వల్ల కూడా మనిషి యవ్వనం తరిగిపోకుండా ఉంటుంది. ధ్యానం, వ్యాయమం వంటి కూడా ఆరోగ్యంగా ఉండేలా చేయటంతోపాటు, వృద్ధాప్య చాయలు పోగొడతాయి. నిత్య వ్యాయామాలు శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి.

శరీరం పై నున్న మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపించేలా చేయటంలో స్నానం బాగా పనిచేస్తుంది. వ్యాయమం తరువాత స్నానం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం వల్ల ఆరోగ్యంగా ఉంటూ తేజస్సుతో మొఖం కనిపిస్తుంది. శారీరక, మానసిక వత్తిళ్ళును తగ్గించుకోవటం వల్ల మీకు తెలియకుండానే మీలో మీరు ఉత్సాహ వంతులుగా మారిపోతారు. వత్తిళ్ళు లేని మనిషి నిత్యం యవ్వనంగా కనిపిస్తాడు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా , మంచి అలవాట్లతో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తుంటే వయస్సు పెరిగినా వృద్ధాప్య చాయలు మాత్రం మీ దరికి చేరవు. నిత్యం యాక్టివ్ గా అందరితో సరదాగా జీవితాన్ని గడిపేందుకు వీలుంటుంది.