Cesarean : సీజేరియన్ తరువాత త్వరగా కోలుకోవాలంటే!..

సిజేరియన్ తర్వాత ఒత్తిడి, నొప్పి ఉండటం సహజం. పొట్టపై ప్రెజర్ పెట్టడం మంచిదికాదు. శరీరానికి సరిపడినన్ని నీరు తాగటం అవసరం.

Cesarean : సీజేరియన్ తరువాత త్వరగా కోలుకోవాలంటే!..

Cesarean

Cesarean : ఈ మధ్యకాలంలో నార్మల్ డెలవరీల కంటే సిజేరియన్ లు అధికంగా జరుగుతున్నాయి. అత్యవసర సందర్భంలో తల్లి, బిడ్డ ఆరోగ్యంపై రిస్క్ పడకుండా ఉండేందుకు వైద్యులు తప్పనిసరి పరిస్ధితుల్లో సిజేరియన్ చేస్తుంటారు. సిజేరియన్ సర్జరీ తర్వాత.. త్వరగా కోలుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ డెలివరీ కంటే.. సిజేరియన్ తర్వాత.. శరీరంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. సిజేరియన్ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో బరువు ఎత్తకూడదు. లేదంటే.. సర్జరీ అయిన దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొన్ని వారాలపాటు ఒత్తిడికి గురికావద్దు.

సర్జరీ తర్వాత.. శరీరానికి కొంత సమయం ఇవ్వాలి. బిగుతుగా ఉండే జీన్స్, లెగ్గింగ్స్ వేసుకోకూడదు. నెమ్మదిగా నడవడం వంటి వ్యాయామాలు చేయడం. ఎక్కువగా కదలడం వంటి వాటికి కాస్త సమయం కేటాయించాలి. సిజేరియన్ తర్వాత మొదటి 40రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సూచిస్తుంటారు. కొంతకాలం సెక్స్ కి దూరంగా ఉండటం మంచిది.

సిజేరియన్ తర్వాత ఒత్తిడి, నొప్పి ఉండటం సహజం. పొట్టపై ప్రెజర్ పెట్టడం మంచిదికాదు. శరీరానికి సరిపడినన్ని నీరు తాగటం అవసరం. ఆపరేషన్‌ జరిగిన తరువాత త్వరగా కోలుకోవాలన్నా, గాయం త్వరగా మానాలన్నా ఆరోగ్యకరమెన ఆహారం తీసుకోవడం అవసరం. సులభంగా జీర్ణమయ్యే, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే రైస్, అటుకులు , సేమ్యా మరియు బంగాళాదుంపలు చాలా అవసరం. కొంత కాలం తరువాత ఓట్స్, రాగి, గోధుమ నూక, సజ్జలు మొదలైన తృణధాన్యాలను కూడా తీసుకోవచ్చు. వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు వంటి అదనపు పోషకాలను కలిగి ఉంటాయి. కెలోరీలు, ప్రొటీన్లు, విటమిన్లు, కొన్ని రకాల ఖనిజాలు అధికమోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.

కూరగాయలలో ఉండే ఖనిజాలు గాయం త్వరగా మానేందుకే గాక, అందులోని పీచుపదార్థాల ద్వారా మలబద్దకం రాకుండా నివారిస్తాయి. ఐరన్‌ అధికంగా ఉండే ఆకుకూరలు, రాజ్మా, నల్లశనగలు, ఉలవలు లాంటివి తరచూ తింటూ ఉండాలి. శక్తిని, యాంటీ ఆక్సిడెంట్స్‌ను అధికంగా అందించే పండ్లను రోజుకు రెండుసార్లైనా తీసుకోవాలి. గాయానికి తిరిగి ఇన్‌ఫెక్షన్‌ కాకుండా ఉండడానికి విటమిన్‌- సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ పండ్ల రసాలను తీసుకోవాలి. మంచి ఆహారంతో పాటు తప్పని సరిగా శరీరానికి విశ్రాంతినిస్తే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఎక్కువ.