ఇంటర్నేషనల్ టీ డే: టీలో రకాలు.. వాటి వల్ల బెనిఫిట్స్ ఇవే

ఇంటర్నేషనల్ టీ డే: టీలో రకాలు.. వాటి వల్ల బెనిఫిట్స్ ఇవే

డిసెంబర్ 15 టీ ఇష్టపడే వాళ్లంతా తెలుసుకోవాల్సిన రోజు.. ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా అది కేవలం అలవాటు మాత్రమే కాదని అందులో చాలా రకాలు ఉంటాయని వాటి వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తాగే వాళ్లున్న టీ పౌడర్ ఉత్పత్తిని చైనా అత్యంత ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తుంటే.. ఇండియా రెండో స్థానంలో ఉంది.

యావరేజ్ గా చూసుకుంటే ఇండియాలో ప్రతి ఇంట్లో రోజుకు 3-4కప్పుల టీ అవసరం. టీ కేవలం మైండ్ కు మాత్రమే కాదు.. హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది. వీటిల్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్.. వాటి బెనిఫిట్స్ ఇవి.

గ్రీన్ టీ:
వెయిట్ లాస్ కు ఉపయోగించే సాధనాల్లో గ్రీన్ టీ చాలా ఇంపార్టెంట్. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయి క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బ్లాక్ టీ
ఈ టీ వల్ల కార్టిశాల్ తగ్గడంతో ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. ఫలితంగా హార్ట్ అటాక్స్ రిస్క్ తగ్గుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ గా.. ఎముకల బలానికి చాలా మంచిది.

ఊలాంగ్ టీ
ఈ ఊలాంగ్ టీ మెంటల్ అలర్ట్‌నెస్ పెంచుతుంది. దాంతో పాటు పంటి ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బుల నుంచి బయటపడేస్తుంది. ఓస్టియోపోరోసిస్ లక్షణాలు కూడా కంట్రోల్ చేస్తుంది.

చామోమైల్ టీ
కడుపులో నొప్పి లాంటి సమస్యలు తగ్గించగలదు. మైండ్ ను ప్రశాంతంగా ఉంచుతుంది. ఇన్‌సోమ్నియా, మైగ్రేన్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అల్లం టీ
ఆల్ టైం ఫేవరేట్ టీ ఏదైనా ఉందంటే అది అల్లం టీ. ఇది యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ ప్రొపర్టీస్ ఉండటంతో గొంతులో నొప్పి, దగ్గుల నుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా చికాకు, మలబద్ధకం నుంచి రిలీఫ్ ఇస్తుంది.