కశ్మీర్‌లో డిజిటల్ ఎమర్జెన్సీ: 100 రోజులుగా నో ఇంటర్నెట్!

  • Published By: sreehari ,Published On : December 9, 2019 / 01:56 PM IST
కశ్మీర్‌లో డిజిటల్ ఎమర్జెన్సీ: 100 రోజులుగా నో ఇంటర్నెట్!

కశ్మీర్‌లో డిజిటల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. నాలుగు నెలలుగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 100 రోజుల నుంచి ప్రపంచంతో కశ్మీర్ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. కశ్మీర్ లోయలో సోషల్ మీడియా మూగబోయింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత ప్రభుత్వం కశ్మీర్ ప్రాంతాల్లో పూర్తిగా ఇంటర్నెట్ సర్వీసులను షట్ డౌన్ చేసింది.

అప్పటినుంచి డిజిటల్ ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి అక్కడి ప్రజలంతా ఒంటరిగా మిగిలిపోయారు. వాట్సాప్ సర్వీసులు కూడా క్రమంగా నిలిచిపోయాయి. వారధిలా పనిచేసిన ఇంటర్నెట్ సర్వీసులు బంద్ కావడంతో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసే పరిస్థితి లేదు. ఏళ్లనాటి ఫొటోలు, వీడియోలు, తీపి జ్ఞాపకాలన్నీ చెరిగిపోయే పరిస్థితికి చేరుకుంది.

దేశీయ ముస్లీం మెజార్టీ రాష్ట్రమైన కశ్మీర్ ప్రత్యేక స్వయంప్రతిపత్తిని ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేయడంతో నాలుగు నెలల క్రితం నుంచి కశ్మీర్ వర్చువల్ లాక్ డౌన్ ప్రారంభమైంది. అప్పటినుంచి కశ్మీర్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కశ్మీర్ ప్రాంతానికి ప్రభుత్వం పదివేలకు పైగా బలగాలను మోహరించింది. 

మూగబోయిన వాట్సాప్ :
శాంతిభద్రతలకు భంగం వాటిల్ల కుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాలను బలగాలు తమ అధీనంలో తీసుకున్నాయి. ప్రయాణాలపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. అన్ని ఫోన్లు, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సర్వీసులను నిలిపివేశారు. కశ్మీర్ లో సోషల్ మీడియా మూగబోవడంతో వాట్సాప్ యూజర్ల అకౌంట్లన్నీ ఒక్కొక్కటిగా డిలీట్ అయిపోతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి.

లోయలో ఆగస్టు 5 నుంచి అంధకారం :
ప్రత్యేకించి వాట్సాప్ యూజర్లకు వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయని చెబుతున్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో నివసించే వారికి ఆగస్టు 5 నుంచి స్నేహితులు, బంధువుల వాట్సాప్ అకౌంట్లు తమ కాంటాక్టు జాబితా నుంచి అదృశ్యమైనట్టు వాపోతున్నారు. ‘ మేము.. ఆగస్టు 5 నుంచి మా ఫ్యామిలీ గ్రూపు చాట్ ను ఉపయోగించలేదు. కానీ, ఈ రోజు మా ఫ్యామిలీ గ్రూపు నుంచి ఒక్కసారిగా వెళ్లిపోవడం చాలా బాధగా అనిపించింది’ అని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపారు. 

120 రోజుల లిమిట్.. వాడకుంటే ఆటో డిలీట్ :
మరోవైపు వాట్సాప్ అకౌంట్ల డిలీట్ పై కంపెనీ స్పందిస్తూ.. అవన్నీ ఆటోమాటిక్ డిలీట్ అయినట్టు వెల్లడించింది. సెక్యూరిటీ, పరిమిత డేటా నిరోధాన్ని నిర్వహించేలా వాట్సాప్ అకౌంట్లను సాధారణంగా 120 రోజుల పరిమితి విధించినట్టు తెలిపింది. 100 రోజులకు పైగా వాట్సాప్ ఇన్ యాక్టివిటీ గా ఉంటే అట్టి అకౌంట్లన్నీ ఆటోమాటిక్ గా డిలీట్ అయిపోతాయని ఒక ప్రకటనలో కంపెనీ స్పష్టం చేసింది.

కొన్ని వాట్సాప్ అకౌంట్లలో వాట్సాప్ గ్రూపు నుంచి ఇతరుల అకౌంట్లు వాటింతట అవే రీమూవ్ అయిపోయినట్టు తెలిపింది. మళ్లీ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ కావాలంటే ఇంటర్నెట్ యాక్సస్ అయిన తర్వాతే సాధ్యపడుతుందని పేర్కొంది.