Prevent Heart Attack : గుండెపోటును నివారించాలంటే ముందుగా ప్రమాద కారకాలను తెలుసుకోండి !

గుండె జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం. ధమనులు, ఇతర రక్త నాళాలలో ప్రవహించే రక్తం యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గుండె పోటు వస్తుంది. అలాగే గుండెతోపాటుగా, మూత్రపిండాలు, మెదడు , ఇతర ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తుంది.

Prevent Heart Attack : గుండెపోటును నివారించాలంటే ముందుగా ప్రమాద కారకాలను తెలుసుకోండి !

Prevent Heart Attack

Prevent Heart Attack : కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది గుండెపోటుకు అత్యంత సాధారణ కారణం. ఇది ప్రాణాంతకమైనది. అదృష్టవశాత్తూ గుండె జబ్బు యొక్క అతిపెద్ద ప్రమాద కారకాల నియంత్రణ అన్నది మీచేతుల్లోనే ఉంది. వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాద కారకాలన్నింటికీ దూరంగా ఉండటంతోపాటు, జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవటం వల్ల గుండె జబ్బులు , గుండెపోటు బారిన పడకుండా నిరోధించవచ్చు.

READ ALSO : High Blood Pressure : హైబీపీ మీ గుండెను మాత్రమే కాదు.. మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభవం చూపిస్తుంది

గుండెపోటు రాకుండా నిరోధించగలిగిన కారకాలు :

1. అధిక రక్తపోటు:

గుండె జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం. ధమనులు, ఇతర రక్త నాళాలలో ప్రవహించే రక్తం యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గుండె పోటు వస్తుంది. అలాగే గుండెతోపాటుగా, మూత్రపిండాలు, మెదడు , ఇతర ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తుంది. వైద్యుల సూచనమేరకు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతోపాటు, మందులతో రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి.

READ ALSO : ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌తో గుండెపోటు..!

2. అతిగా మద్యం సేవించడం:

రోజువారిగా ఆల్కహాల్ అధిక మోతాదులో తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది. ఈ అధిక రక్తపోటు కాలక్రమేణా గుండె కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది చివరకు హృదయ సంబంధ వ్యాధులు, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగిస్తుంది.

READ ALSO : High Cholesterol : గుండెను కాపాడుకోవటానికి ఈ విషయాలు గుర్తుంచుకోండి !

3. నిశ్ఛలమైన జీవనశైలి:

శారీరక శ్రమ లేకపోవడం వంటి నిశ్ఛలమైన జీవనశైలి వల్లకూడా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక రక్త కొలెస్ట్రాల్, టైప్ 2 మధుమేహం వంటి ఇతర గుండె జబ్బులను కలిగించే అవకాశాలు ఉంటాయి.

READ ALSO : Heart Attack : గుండెపోటు తర్వాత యువకుల కంటే యువతులకే ఎందుకు సమస్యలు ఉత్పన్నం అవుతాయ్ ?

4. అనారోగ్యకరమైన ఆహారం:

ఉప్పు, కొవ్వు,చక్కెరలు అధికంగా ఉన్న అనారోగ్యకరమైన ఆహారం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండెతో సహా ధమనుల గోడలలో అదనపు కొలెస్ట్రాల్ ఏర్పడేలా చేస్తుంది. ధమనులను గట్టిపరుస్తుంది. గుండెకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. చివరకు గుండెపోటు ప్రమాదానికి గురయ్యేలా చేస్తుంది.

READ ALSO : Healthy Heart : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలను మీ ఆహారంలో చేర్చుకోండి !

5. ధూమపానం:

ధూమపానం గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది రక్త నాళాలలో ఫలకం ఏర్పడటాన్ని పెంచడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.