Musk Melon : సంతానలేమి వారికి ఖర్బూజా మంచి ఆహారం…

చర్మం దురదగా ఉన్నవారు కర్భూజా గుజ్జును తింటే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఎండలో బయటకి తిరిగేవారు ఖర్బుజ జ్యూస్ తాగడం వల్ల త్వరగా

Musk Melon : సంతానలేమి వారికి ఖర్బూజా మంచి ఆహారం…

Musk Melon

Musk Melon : వేసవి కాలంలో అధికంగా లభించే పండ్ల జాబితాలో ఖర్భూజాకు ప్రత్యేక స్ధానం ఉంది. ఆసమయంలో ఖర్బూజా జ్యూస్ ను తాగేందుకు ఎక్కవ మంది ఇష్టపడుతుంటారు. వేసవిలో లభించే ఖర్బుజతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఖర్బుజ లో విటమిన్ కె, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పిల్లలు కలగక చాలా కాలంగా బాధపడుతుంటారు. అలాంటి వారు. ఈ పండును తీసుకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఖర్భుజా విటమిన్ ఎ లోపం వల్ల కలిగే వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇక ఇందులో ఉండే బీటాకెరోటిన్ క్యాన్సర్ కారక కణాలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచటంలో దోహదం చేస్తుంది. వేసవిలో చాలా మంది ఎండ తీవ్రతకారణంగా వడబెబ్బకు గురవుతుంటారు. అయితే ఖర్భూజాను తినటం వల్ల వడబెబ్బ సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చు.

చర్మం దురదగా ఉన్నవారు కర్భూజా గుజ్జును తింటే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఎండలో బయటకి తిరిగేవారు ఖర్బుజ జ్యూస్ తాగడం వల్ల త్వరగా అలసలేకుండా చురుకుగా ఉంటారు. ఖర్బుజలో ఉండే విటమిన్ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేయటంతోపాటు కంటి చూపు మెరుగుపరడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్ అందుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు దూరం చేయడంలో ఖర్బూజ ఉపయోగపడుతుంది. కిడ్నీ లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఖర్బుజ ను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలకపాత్ర పోషిస్తుంది. కర్భూజా పండు తోలుని మెత్తగా నూరి ముఖానికి అప్లై చేస్తే ముఖం మీద ముడతలు పోయి నిగనిగలాడుతుంది.