ఈ-సిగిరెట్లు ప్రమాదం: ప్రధానికి లేఖ రాసిన డాక్టర్లు
చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగితే కిక్కు ఉంటుంది. పొగాకు ఉండదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా?

చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగితే కిక్కు ఉంటుంది. పొగాకు ఉండదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా?
చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగితే కిక్కు ఉంటుంది. పొగాకు ఉండదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా? ఇది పెద్ద ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. ఈ మేరకు 27 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా డాక్టర్లు ప్రధాని మోడీకి లేఖను రాశారు.
ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టం (ఈఎన్‌డీఎస్)తో కూడిన ఈ-సిగరెట్లు, ఈ-హుక్కాలతోపాటు విరివిగా దొరుకుతున్న వేప్, వేప్ పెన్‌లాంటి వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ-సిగరెట్లను నిషేధించాలని గతేడాది కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినా, అన్ని రాష్ట్రాల్లో పూర్తిగా అమలు కావట్లేదని విరివిగా ఈ-సిగిరెట్లు మార్కెట్లో దొరుకుతున్నాయని డాక్టర్లు తమ లేఖలో వెల్లడించారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?
దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీ యువకులు ముఖ్యంగా టీనేజర్లు ఈ-సిగిరెట్లను ఎక్కువగా వాడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా ఇది పొగ బయటకు వదలదు. అందువల్ల ఈ-సిగిరెట్లు తాగేవాళ్లను గుర్తించడం కష్టం. అయితే సాధారణ సిగరెట్లతో ఎంతటి ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందో, అంతకుమించి ఈ-సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచంలో ఇప్పటికే 36దేశాలు ఈ-సిగరెట్లను బ్యాన్ చేశాయి. ఈ-సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే. కాగా గత మార్చిలో కూడా ప్రధానికి డాక్టర్లు ఇదే విషయమై లేఖను రాశారు.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్