Regular Booster Vaccines : రెగ్యులర్ బూస్టర్ వ్యాక్సిన్లే భవిష్యత్తులో కరోనావైరస్‌తో పోరాడగలవు

ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి మింగేస్తోంది. రోజురోజుకూ మ్యుటేషన్ అవుతూ ఏ వ్యాక్సిన్ కు లొంగనంతంగా బలపడుతోంది. భవిష్యత్తులో కరోనాతో పోరాడాలంటే రెగ్యులర్ బూస్టర్ వ్యాక్సిన్ల అవసరం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Regular Booster Vaccines : రెగ్యులర్ బూస్టర్ వ్యాక్సిన్లే భవిష్యత్తులో కరోనావైరస్‌తో పోరాడగలవు

Regular Booster Vaccines Are The Future

Regular booster vaccines to battle with Covid-19 Virus : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి మింగేస్తోంది. రోజురోజుకూ కరోనా మ్యుటేషన్ అవుతూ ఏ వ్యాక్సిన్ కు లొంగనంతంగా బలపడుతోంది. భవిష్యత్తులో కరోనావైరస్ తో పోరాడాలంటే రెగ్యులర్ బూస్టర్ వ్యాక్సిన్ల అవసరం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రపంచంలోని కరోనా మహమ్మారితో ఈ తరహా వ్యాక్సిన్లు మాత్రమే సమర్థవంతంగా పోరాడగలవని అంటున్నారు.

కరోనా మ్యుటేషన్లతో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుంది. 2019లో చైనాలో ఉద్భవించిన ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2.65 మిలియన్ల మందిని బలితీసుకుంది. ప్రతి రెండు వారాలకు వైరస్ వేగంగా మ్యుటేట్ అవుతోంది. ఇన్ ఫ్లూయింజా లేదా హెచ్ఐవీల కంటే చాలా నెమ్మదిగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెగ్యులర్ బూస్టర్ షాట్ల సరఫరా అవసరమైనంత సరిపోదని అంటున్నారు. COVID-19 Genomics UK (COG-UK) అధినేత Sharon Peacock చెప్పిన ప్రకారం.. సగానికి పైగా కరోనా వైరస్ జన్యువులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.

ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాడేందుకు అంతర్జాతీయ సహాకారం తప్పనిసరిగా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ బూస్టర్ షాట్లు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. కరోనా వైరస్‌కు రోగనిరోధక శక్తి ఎప్పటికీ ఉండదని పేర్కొన్నారు. వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదని, అందుకే టీకా మోతాదులను పెంచుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో వేరియంట్‌లను ఎదుర్కోవటానికి ఇన్ఫ్లుఎంజా వంటి సాధారణ రెగ్యులర్ బూస్టర్ షాట్‌లు అవసరమవుతాయని అన్నారు.